ఆ లేఖపై సీఐడీ దర్యాప్తు ముమ్మరం: నిమ్మగడ్డ పీఎస్ సాంబమూర్తి విచారణ

By narsimha lodeFirst Published May 3, 2020, 1:38 PM IST
Highlights

 ఏపీ మాజీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రమేష్ కుమార్ కేంద్ర హోంశాఖ కార్యదర్శికి రాసిన లేఖ విషయమై దర్యాప్తులో సీఐడీ మరింత వేగం పెంచింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వద్ద పీఎస్ గా పనిచేసిన సాంబమూర్తిని సీఐడీ అధికారులు విచారిస్తున్నారు.

అమరావతి: ఏపీ మాజీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రమేష్ కుమార్ కేంద్ర హోంశాఖ కార్యదర్శికి రాసిన లేఖ విషయమై దర్యాప్తులో సీఐడీ మరింత వేగం పెంచింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వద్ద పీఎస్ గా పనిచేసిన సాంబమూర్తిని సీఐడీ అధికారులు విచారిస్తున్నారు.

నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసిన లేఖకు సంబంధించి విచారణ జరిపించాలని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ లేఖపై విచారణను సీఐడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శికి తానే లేఖ రాసినట్టుగా మాజీ ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రమేష్ కుమార్ ఇదివరకే ప్రకటించారు.

రమేష్ కుమార్ కు బయటి నుండి ఈ లేఖ అందినట్టుగా ఇప్పటికే సీఐడీ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ విషయాన్ని సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ఇదివరకే మీడియాకు తెలిపారు. ఈ లేఖను ప్రింట్ తీయడంతో పాటు రమేష్ కుమార్ కు పంపడానికి డెస్క్ టాప్, ల్యాప్ టాప్, పెన్ డ్రైవ్ ను ఉపయోగించినట్టుగా సీఐడీ గుర్తించింది.

also read:నిమ్మగడ్డ లేఖలో ట్విస్ట్: సీఐడీ దర్యాప్తులో సంచలనాలు, ఆధారాలు ధ్వంసం

అయితే ఈ లెటర్ డ్రాఫ్ట్ చేసిన ల్యాప్ టాప్ లో లెటర్ డిలీట్ చేశారు. డెస్క్ టాప్ ను ఫార్మెట్ చేశారు. పెన్ డ్రైవ్ ను కూడ ధ్వంసం చేసిన విషయాన్ని గుర్తించినట్టుగా సీఐడీ అధికారులు తెలిపారు.

ఈ విషయమై నిమ్మగడ్డ రమేష్ కుమార్ వద్ద పీఎస్ గా పనిచేసిన సాంబమూర్తిని ఆదివారం నాడు సీఐడీ అధికారులు విచారించారు. బయటినుండే రమేష్ కుమార్ కు లేఖ అందినట్టుగా సీఐడీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. 

రమేష్ కుమార్  ల్యాప్ టాప్‌కు  ఏ కంప్యూటర్ నుండి ఈ లేఖ అందిందనే విషయమై సీఐడీ దర్యాప్తు చేస్తోంది. ఇదే విషయమై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు సీఐడీ అధికారులు. హైద్రాబాద్ లో ఉన్న సాంబమూర్తిని ఇవాళ సీఐడీ అధికారులు విచారణ చేశారు. మరో వైపు అవసరమైతే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కూడ విచారణ చేయనున్నట్టుగా సీఐడీ అధికారులు తెలిపారు.

click me!