24 గంటల్లో 156 కరోనా కేసులు... చిత్తూరులో అత్యధికం, ఏపీలో 20,71,813కి చేరిన సంఖ్య

Siva Kodati |  
Published : Dec 11, 2021, 06:21 PM IST
24 గంటల్లో 156 కరోనా కేసులు... చిత్తూరులో అత్యధికం, ఏపీలో 20,71,813కి చేరిన సంఖ్య

సారాంశం

ఏపీలో కొత్తగా 156 కరోనా కేసులు (corona cases in ap) నమోదవ్వగా.. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 188 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 1954 మంది చికిత్స పొందుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌‌‌లో (corona cases in ap) గడిచిన 24 గంటల్లో 156 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 20,71,813కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా (corona deaths in ap) మరణించిన వారి సంఖ్య 14,465కి చేరుకుంది. 

గడిచిన 24 గంటల్లో కోవిడ్ వల్ల కృష్ణా, నెల్లూరు, విశాఖపట్నంలలో జిల్లాల్లో ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోయారు నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 188 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 20,55,394కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 31,131 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 3,07,46,537కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 1954 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజు అనంతపురం 4, చిత్తూరు 31, తూర్పుగోదావరి 11, గుంటూరు 24, కడప 2, కృష్ణ 18, కర్నూలు 1, నెల్లూరు 9, ప్రకాశం 6, శ్రీకాకుళం 10, విశాఖపట్నం 12, విజయనగరం 1, పశ్చిమ గోదావరిలలో 27 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు. 


 

PREV
click me!

Recommended Stories

Chandrababu Launches Anna Canteen: అన్న క్యాంటీన్’ ప్రారంభించిన సీఎం చంద్రబాబు | Asianet News Telugu
CM Chandrababu: అన్న క్యాంటీన్లో అన్నం వడ్డించి ముచ్చటించిన సీఎం చంద్రబాబు | Asianet News Telugu