భూమా అఖిలప్రియకు సీఐడీ నోటీసులు

By telugu news teamFirst Published Sep 24, 2020, 8:20 AM IST
Highlights

కర్నూలులో కరోనా పాజిటివ్ కేసులు పెరగడానికి స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలే కారణమని భూమా అఖిల ప్రియ అన్నారు. అలాగే కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ను టార్గెట్ చేశారు. 

మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ క్వారంటైన్ సెంటర్‌కు వెళ్లి కరోనా వ్యాప్తి చేశారని అఖిలప్రియ ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలపై హఫీజ్ ఖాన్ సీరియస్ అయ్యారు. ఆయన సీఐడీకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అఖిలప్రియను సీఐడీ అధికారులు గురువారం విచారించనున్నారు. కాగా.. ఇప్పటి వరకు ఈ నోటీసులపై అఖిలప్రియ స్పందించలేదు.

కర్నూలులో కరోనా పాజిటివ్ కేసులు పెరగడానికి స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలే కారణమని భూమా అఖిల ప్రియ అన్నారు. అలాగే కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ను టార్గెట్ చేశారు. ఇటు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ట్రాక్టర్లతో ర్యాలీ చేశారని.. ఎమ్మెల్యేల తీరు చూసి అందరూ నవ్వుతున్నారని.. శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే నిర్వాకం వల్ల 8 మంది ప్రభుత్వ అధికారులకు కరోనా వచ్చింది అన్నారు. కేసులు పెరగడానికి కారణమైన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.
 

click me!