అమరావతి అసైన్డ్ భూముల కేసు: టీడీపీ హయంలో జీవోలపై సీఐడీ ఆరా

By narsimha lode  |  First Published Mar 28, 2021, 2:25 PM IST

అమరావతిలో అసైన్డ్ భూముల కేసులో  ఏపీ సీఐడీ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.


అమరావతి: అమరావతిలో అసైన్డ్ భూముల కేసులో  ఏపీ సీఐడీ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

అసైన్డ్ భూముల వ్యవహారంలో అప్పటి సీఎం చంద్రబాబునాయుడు జారీ చేసిన జీవోలతో అసైన్డ్ భూముల విషయంలో అవకతవకలు చోటు చేసుకొన్నాయని వైసీపీ ఎమ్మెల్యే  ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.

Latest Videos

ఈ మేరకు ఆయన ఈ ఏడాది  ఫిబ్రవరిలో సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఏపీ సీఐడి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.టీడీపీ హయంలో జీవోల జారీకి సంబంధించిన ఆధారాలను సీఐడీ సేకరించే ప్రయత్నం చేస్తోంది.అసైన్డ్ , లంక భూముల జీవోల వెనకున్న నోట్ ఫైల్స్ ను  సీఐడీ సేకరిస్తోంది.

రైతుల నుండి సేకరించిన ఆధారాలు, నోట్ ఫైల్స్ ను కోర్టుకు  సీఐడీ అందజేయనుంది.భూముల అక్రమాల్లో నాటి ప్రభుత్వ పెద్దల పాత్ర నోట్ ఫైల్స్ ఉందంటోన్న సీఐడీ అధికారులు.అమరావతిలో భూముల కుంభకోణం జరిగిందని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ విషయమై జగన్ సర్కార్ కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది.ఈ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి ఓ నివేదికను కూడ సమర్పించింది.
 

click me!