ఏపీ బడ్జెట్ ఆర్డినెన్స్: గవర్నర్ ఆమోదం

By narsimha lodeFirst Published Mar 28, 2021, 1:25 PM IST
Highlights

ఏపీ బడ్జెట్ ఆర్డినెన్స్ కు ఆదివారం నాడు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదించారు.

అమరావతి: ఏపీ బడ్జెట్ ఆర్డినెన్స్ కు ఆదివారం నాడు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదించారు.

తిరుపతి ఉప ఎన్నికలు, పరిషత్ ఎన్నికల నిర్వహించాల్సిన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలను తర్వాత నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.దీంతో మార్చి నెలాఖరుకు బడ్జెట్ కు అసెంబ్లీ ఆమోదం తెలపాలి. అయితే మూడు మాసాల బడ్జెట్ కు ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది.

సుమారు రూ. 90 వేల కోట్ల బడ్జెట్ ఆర్డినెన్స్ కు ఏపీ కేబినెట్ ఈ నెల 26వ తేదీన ఆమోదం తెలిపింది. ఈ ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం కోసం ప్రభుత్వం అదే రోజున పంపింది. 
ఈ ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం తెలిపారు.  

also read:బడ్జెట్ ఆర్డినెన్స్‌కు ఏపీ కేబినెట్ ఆమోదం: ఏప్రిల్ లో పూర్తిస్థాయి బడ్జెట్

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, నవరత్నాల పథకాల అమలు కోసం ఆర్డినెన్స్ అనివార్యంగా మారింది.ఈ ఏడాది ఏప్రిల్ రెండు లేదా మూడో వారంలో ఏపీ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సమావేశంలో  పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

గత ఏడాది కూడ  ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. మూడు మాసాల పాటు బడ్జెట్ కోసం ఆర్డినెన్స్ తెచ్చిన విషయం తెలిసిందే. గత ఏడాది మాదిరిగా ఈ ఏడాది కూడ ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది.
 

click me!