టీడీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన ఏపి బీజేపీ

First Published 20, Sep 2018, 8:53 PM IST
Highlights

తెలుగుదేశం ప్రభుత్వంపై ఏపీ బీజేపీ నేతలు నిప్పులు చెరిగారు. కాకినాడలో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో బీజేపీ నేతలు టీడీపీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ పలు రాజకీయ తీర్మానాలు చేసింది. ఉచిత ఇసుక పేరుతో టీడీపీ నేతలు వందల కోట్లు వెనకేసుకున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గం ఆరోపించింది. 

కాకినాడ: తెలుగుదేశం ప్రభుత్వంపై ఏపీ బీజేపీ నేతలు నిప్పులు చెరిగారు. కాకినాడలో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో బీజేపీ నేతలు టీడీపీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ పలు రాజకీయ తీర్మానాలు చేసింది. ఉచిత ఇసుక పేరుతో టీడీపీ నేతలు వందల కోట్లు వెనకేసుకున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గం ఆరోపించింది. టీడీపీ సర్కార్ ఉత్తరాంధ్ర, రాయలసీమలకు తీరని అన్యాయం చేసిందని తీర్మానించింది. 

రాయలసీమపై టీడీపీ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించింది. రాయలసీమలో 15 లక్షల ఎకరాలకు సాగునీరందించే అవకాశం ఉన్నా చొరవచూపడం లేదని బీజేపీ రాష్ట్ర కార్యవకర్గం అభిప్రాయపడింది. ప్రభుత్వ వైఖరి వల్ల ఉత్తరాంధ్ర మరింత నష్టపోయిందని ఆరోపించింది. అన్నా క్యాంటీన్లు ఎన్నికల స్టంట్ గా అభిప్రాయపడింది. 
నీరు మట్టి కార్యక్రమంలో వందల కోట్ల అవినీతి జరిగిందని తెలిపింది.  

 మరోవైపు సాగునీటి ప్రాజెక్టులు, కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి ఏపీ సర్కార్ సహకరించడం లేదని తెలిపింది. రాష్ట్రంలో పాల డెయిరీలు నష్టాలతో మూత పడుతుంటే చంద్రబాబు కుటుంబ డెయిరీ మాత్రం లాభాలతో వృద్ధి చెందుతోందని విమర్శించింది. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటుపై చంద్రబాబు మాట ఇచ్చి తప్పారని ధ్వజమెత్తింది. ఏపీలో పెట్రోలు ధర ఎక్కువ ఉండడానికి రాష్ట్ర పన్నులే కారణమని బీజేపీ ఆరోపించింది.

Last Updated 20, Sep 2018, 8:53 PM IST