మాస్క్ పెట్టుకోని సీఐకి ఫైన్.. !

Published : Mar 29, 2021, 12:26 PM IST
మాస్క్ పెట్టుకోని సీఐకి ఫైన్.. !

సారాంశం

గుంటూరులో ఓ సీఐ మాస్క్ ధరించని కారణంగా ఫైన్ కట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి సూచించారు. 

గుంటూరులో ఓ సీఐ మాస్క్ ధరించని కారణంగా ఫైన్ కట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి సూచించారు. 

ఆదివారం అర్భన్ పరిదిలో మాస్క్ ధరించని వారిమీద స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఎస్పీ అమ్మిరెడ్డి లాడ్జి కూడలి, ఎంటీబీ కూడలిలో స్పెషల్ డ్రైవ్ లో పాల్గొన్నారు. 

లాడ్జ్ కూడలిలో తుళ్లూరు ట్రాఫిక్ సీఐ మల్లికార్జునరావు మాస్క్ పెట్టుకోకుండా వెళ్లడం గుర్తించిన ఎస్పీ అతన్ని ఆపారు. పిలిచి మాస్క్ ఎందుకు పెట్టుకోలేదని ప్రశ్నించారు. అత్యవసరంగా విధులకు హాజరవ్వడానికి వెడుతూ మరిచి పోయినట్లు సీఐ వెల్లడించారు. 

దీంతో కరోనా ఉదృతమవుతున్న నేపథ్యంలో నిర్లక్ష్యం తగదని, పోలీసులు కూడా జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ అన్నారు. మాస్క్ పెట్టుకోనందుకు అతనికి ఫైన్ వేయాలని అధికారులను ఆదేశించారు. 

ఆ తరువాత ఎస్పీ స్వయంగా మాస్క్ తెప్పించి సీఐకి పెట్టారు. డ్రైవ్ సందర్భంగా మాస్క్ ధరించకుండా వెల్తున్న వాహనదారులు, పాదచారులకు ఎస్పీ హితబోధ చేశారు. దగ్గర్లోని వ్యాపారుల్ని పిలిచి.. మాస్కులు పెట్టుకున్న వారినే దుకాణాల్లోకి అనుమతించాలని తెలిపారు. 

దుకాణాల్లో శానిటైజర్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. నలుగురికి మించి ఉంచొద్దన్నారు. వైరస్ వ్యాప్తి కట్టడికి ప్రతి ఒక్కరు బాధ్యతతో మెలగాలని సూచించారు. ఎస్పీ వెంట స్పెషల్ బ్రాంచి డీఎస్పీ బాలసుందరరావు, సీఐ నరేష్ కుమార్, ఎస్సైలు ఉన్నారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం