పవన్ కల్యాణ్ తిరుగులేని నాయకుడా..? ఆ సినిమాకు ముగింపు పలకాలి: మాజీ మంత్రి పిలుపు

By Arun Kumar PFirst Published Mar 29, 2021, 12:03 PM IST
Highlights

తిరుపతి ఉపఎన్నికల్లో మిత్రపక్షం జనసేనను పోటీ నుండి తప్పించి ఇప్పుడు పవన్ కల్యాణ్ రాష్ట్రానికి అధినేతను అవుతాడని బిజెపి నాయకులు అంటున్నారని... జనసేనానిని ఏవిధంగా తిరుగులేని నాయకుడుగా చేస్తారో చెప్పాలి? అని జవహర్ నిలదీశారు. 

తిరుపతి: ఆంధ్ర ప్రదేశ్ లో బారతీయ జనతా పార్టీ సినిమాకు తీసిపోని విధంగా ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిపిస్తోందని మాజీ మంత్రి కేఎస్ జవహర్ విమర్శించారు. జాతీయ పార్టీ అయిన బిజెపికి ఒకే జాతీయ విధానం లేకపోవటం దురదృష్టకరమన్నారు. తిరుపతి ఉపఎన్నికల్లో మిత్రపక్షం జనసేనను పోటీ నుండి తప్పించి ఇప్పుడు పవన్ కల్యాణ్ రాష్ట్రానికి అధినేతను అవుతాడని బిజెపి నాయకులు అంటున్నారని... జనసేనానిని ఏవిధంగా తిరుగులేని నాయకుడుగా చేస్తారో చెప్పాలి? అని జవహర్ నిలదీశారు. 

''తెలంగాణలో లేని అభిమానం పవన్ పై తిరుపతిలో ఎందుకు వచ్చిందో సోము వీర్రాజు చెప్పాలి. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తెలంగాణ బిజెపి తనను అవమానించిందని పవన్ కల్యాణ్ స్వయంగా ప్రకటించారు. అలాంటిది ఇప్పుడు తిరుపతిలో పవన్ ను వాడుకుని ఓట్లు దండుకోడానికే బిజెపి ప్రయత్నిస్తోంది'' అని జవహర్ పేర్కొన్నారు. 
 
''సీఎం జగన్ రెడ్డి ఏ ఫైల్ పంపినా అర్దగంటలో గవర్నర్ క్లియరెన్స్ ఇస్తున్నారు. వైసిపి ప్రభుత్వ నిర్ణయాలపై గవర్నర్ ఆమోదం బిజెపి చలవే. తమకు సహకరిస్తున్నందుకు జగన్ కు గవర్నర్ ద్వారా బిజెపి రిటర్న్ గిప్ట్ ఇస్తున్నారు. పైకి జగన్ పై విమర్శలు చేస్తూనే లోలోపల ఆయనతో బిజెపి నాయకులు అపారమైన అనుబంధాన్ని ఏర్పర్చుకుంటున్నారు. కాబట్టి బిజెపి జనసేన, వైసిపిలతో కలిసి రక్తి కట్టిస్తున్న ఈ సినిమాకి తిరుపతి ప్రజలే ముగింపు పలకాలి'' అని జవహర్ పిలుపునిచ్చారు. 

read more  బిజెపితో జనసేన పొత్తులోనే వుంది... పార్టీశ్రేణులు గుర్తించాలి..: నాదెండ్ల మనోహర్

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక నేపథ్యంలో ఆదివారం రాత్రి తిరుపతిలో జనసేన-బిజెపి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ బిజెపి అధ్యక్షుడు  సోము వీర్రాజు మాట్లాడుతూ... జనసేన-బిజెపి కలిసి బలమైన శక్తిగా మారి ప్రజలకు మేలు చేస్తాయన్నారు. ముఖ్యమంత్రి జగన్ నవరత్నాలు అని ప్రచారం చేసుకుంటున్నారని... అయితే ప్రధాని  మోడీ వివిధ పథకాల ద్వారా అంతకంటే ఎక్కువ మేలు చేశారన్నారు. గత ప్రభుత్వం టైంలో కూడా ఉపాధి హామీకి ఎంతో నిధిని సమకూర్చారన్నారు. 

''జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ అంటే మోడీకి ఎంతో అభిమానం... 2014లోనే నాతో మోడీ చెప్పారు పవన్ కళ్యాణ్ ను మనం గౌరవంగా చూసుకోవాలి అని. ఈ రాష్ట్రానికి అధిపతి అయ్యేది  పవనే. ఈ విషయాన్ని అందరూ ట్రూ స్పిరిట్ లో తీసుకోవాలి. తిరుపతి ఉప ఎన్నికలో బిజేపీ, జనసేన బలంగా నిలిచి, చక్కటి సమన్వయంతో విజయం సాధించాలి'' అంటూ పవన్ ప్రశంసలు కురిపించారు.  ఈ వ్యాఖ్యలపైనే తాజాగా మాజీ మంత్రి జవహర్ రియాక్ట్ అయ్యారు. 
 
 

click me!