పవన్ కల్యాణ్ కు నన్ను తిట్టడమే పని: చంద్రబాబు

Published : Jun 04, 2018, 02:25 PM IST
పవన్ కల్యాణ్ కు నన్ను తిట్టడమే పని: చంద్రబాబు

సారాంశం

తనపై తీవ్రమైన విమర్శలు చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.

విజయనగరం: తనపై తీవ్రమైన విమర్శలు చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. పవన్ కల్యాణ్ కు తనను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. 

విజయనగరం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారంనాడు పర్యటిస్తున్నారు. జమ్మాదేవిపేటలో రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 

ఆంధ్రులను ప్రధాని మోడీ నమ్మించి మోసం చేశారని ఆయన అన్నారు. వైసీపీ ఎంపీల రాజీనామాల డ్రామాను ప్రజలు అర్ధం చేసుకున్నారని అన్నారు. 

అంతకు ముందు ఆయన లక్కవరపుకోట మండలం జమ్మాదేవిపేట గ్రామంలో పర్యటించారు. వీధుల్లో తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే
Cold Wave Alert : తెలంగాణపై చలి పంజా.. ఈ జిల్లాల్లో వచ్చే పదిరోజులు అత్యల్ప ఉష్ణోగ్రతలు