టెన్త్ ప్రశ్నాపత్రాల లీకేజీ: మాజీ మంత్రి నారాయణ బెయిల్ రద్దు కోరుతూ చిత్తూరు పోలీసుల పిటిషన్

Published : May 13, 2022, 11:39 AM ISTUpdated : May 13, 2022, 11:49 AM IST
టెన్త్ ప్రశ్నాపత్రాల లీకేజీ: మాజీ మంత్రి నారాయణ బెయిల్ రద్దు కోరుతూ చిత్తూరు పోలీసుల పిటిషన్

సారాంశం

మాజీ మంత్రి నారాయణ బెయిల్ రద్దు  చేయాలని చిత్తూరు పోలీసులు శుక్రవారం నాడు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నారాయణ విద్యా సంస్థలపై మాజీ మంత్రి నారాయణ ఆజమాయిషీ కొనసాగుతుందని పోలీసులు చెబుతున్నారు.

తిరుపతి: టెన్త్ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో  మాజీ మంత్రి Narayana బెయిల్ రద్దు చేయాలని కోరుతూ Chittoor పోలీసులు శుక్రవారం నాడు పిటిషన్ దాఖలు చేశారు.Tenth క్లాస్ Telugu ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో మాజీ మంత్రి నారాయణను ఈ నెల 10వ తేదీన Hyderabad లో అరెస్ట్ చేశారు. చిత్తూరు జిల్లాలోని Tirupati నారాయణ విద్యా సంస్థల నుండి తెలుగు ప్రశ్నాపత్రం లీకేజీపై నమోదైన కేసులో నారాయణను అరెస్ట్ చేశారు. ఈ విషయమై ఈ ఏడాది ఏప్రిల్ 27న Chittoor DEO ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.మాజీ మంత్రి నారాయణకు ఈ నెల 11వ తేదీ తెల్లవారుజామున చిత్తూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

also read:నారాయణ అరెస్ట్.. తెరపైకి ఫోన్ల ట్యాపింగ్ వివాదం, అలా అనలేదు: మంత్రి పెద్దిరెడ్డి క్లారిటీ

2014లోనే నారాయణ విద్యా సంస్థల చైర్మన్ పదవికి రాజీనామా చేసినట్లు ఆయన తరఫున న్యాయవాదులు న్యాయమూర్తికి ఆధారాలు చూపించారు. దీంతో ఆ వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు. ఈ సందర్భంగా రూ. లక్ష చొప్పున ఇద్దరు జామీను ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు.

మాజీ మంత్రి  నారాయణ విద్యాసంస్థల అధినేతగా ఉన్నారని పోలీసులు అభియోగం మోపారు. కానీ, 2014లోనే ఆ విద్యాసంస్థల అధినేతగా ఆయన వైదొలిగినట్లు నారాయణ తరపున న్యాయవాది కోర్టులో వాదించారు. నారాయణ విద్యాసంస్థలతో తనకు సంబంధం లేదని, దానికి సంబంధించిన డాక్యుమెంట్లు న్యాయమూర్తికి సమర్పించారు.

 నేరారోపణ నమ్మే విధంగా లేదని జడ్జి అభిప్రాయానికి వచ్చినట్లు చెప్పారు. ఘటన జరిగిననాటికి నారాయణ ఆ విద్యాసంస్థల అధినేత కాదని జడ్జి అభిప్రాయానికి వచ్చినట్లు తెలిపారు. ఈ నెల 18లోగా రూ. లక్ష చొప్పున ఇద్దరి పూచీకత్తు ఇవ్వాలని  న్యాయమూర్తి  ఆదేశించారు.

మరో వైపు నారాయణ బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ చిత్తూరు పోలీసులు శుక్రవారం నాడు కోర్టులో పిటిషన్ ను దాఖలు చేశారు. నారాయణ విద్యా సంస్థల చైర్మెన్ గా టెక్నికల్ గా వైదొలిగారు. కానీ  ఈ విద్యాసంస్థలపై నారాయణ ఆజమాయిషీ కొనసాగుతుందని పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు ఆధారాలను కూడా సేకరించారు. ఇదే విషయమై కోర్టుకు సమర్పించే అవకాశం ఉంది. 
 

PREV
click me!

Recommended Stories

Legendary Actor Krishnam Raju 86th Birth Anniversary | Free Mega Diabetes Camp | Asianet News Telugu
Tirupati: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. తిరుప‌తి ప‌రిస‌ర ప్రాంతాల సంద‌ర్శ‌న‌కు ప్ర‌త్యేక ప్యాకేజీలు