
కుప్పం : కుప్పంలో chandrababu naidu సొంత ఇల్లు నిర్మించుకుంటే చూడాలన్న నియోజకవర్గ ప్రజల కల త్వరలోనే తీరనుంది. దీనికి అవసరమైన Place registration కోసం సంబంధిత పత్రాలపై ఆయన సంతకం కూడా అయిపోయింది. పార్టీ వర్గాల నుంచి సేకరించిన వివరాల ప్రకారం... కుప్పం-పలమనేరు జాతీయ రహదారి సమీపంలో శాంతిపురం మండల పరిధిలోని కడపల్లె, కనమలదొడ్డి గ్రామాల మధ్య శివపురం ఎదురుగా 2.10 ఎకరాల స్థలాన్ని చంద్రబాబు Own House నిర్మాణం కోసం కొనాలని నిర్ణయించారు.
కుప్పం పర్యటనకు వచ్చిన చంద్రబాబు గురువారం ఉదయం ఆ స్థలం రిజిస్ట్రేషన్ పత్రాలపై సంతకాలు చేసి వేలిముద్రలు వేశారు. ఈ నెల 29న స్థలానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. జూన్ 5న చంద్రబాబు, తన సతీమణి భువనేశ్వరితో కుప్పం వచ్చి ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. ఇక్కడ గృహంతో పాటు పార్టీ సమావేశాల కోసం ప్రత్యేకంగా కార్యాలయం భవనం కూడా నిర్మించనున్నారు.