కడప జిల్లాపై సీఎం జగన్‌కు చంద్రబాబు లేఖాస్త్రం.. ‘ఆ సర్వీసులు రీస్టార్ట్ చేయండి’

By telugu teamFirst Published Oct 10, 2021, 2:35 PM IST
Highlights

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఆయన సొంత జిల్లా కడపను ప్రస్తావిస్తూ చంద్రబాబు లేఖాస్త్రం సంధించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కడప ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన విమాన సర్వీసులను పునరుద్ధరించాలని కోరారు.
 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ CM jagan mohan reddyకి శాసన సభా ప్రధాన ప్రతిపక్ష నేత chandrababu naidu లేఖాస్త్రం సంధించారు. జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా kadapaను ప్రస్తావిస్తూ లేఖ రాశారు. తమ హయాంలో అందుబాటులోకి తెచ్చిన విమాన సేవలను కడపలో మళ్లీ పునరుద్ధరించాలని కౌంటర్ ఇచ్చారు. 

ప్రాథమిక, పారిశ్రామిక సేవా రంగాల అభివృద్ధి కోసం రవాణా సౌకర్యాలు అత్యంత కీలకమని, ఏ ప్రాంతం అభివృద్ధి చెందాలన్న రవాణా సౌకర్యమే ప్రధానమని చంద్రబాబు ఆ లేఖలో పేర్కొన్నారు. ఉడాన్ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటూ అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం టైర్-2, టైర్-3 నగరాల మధ్య విమాన సర్వీసులను ఏర్పాటు చేశామని, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విజయవాడ, తిరుపతి నుంచి కడపకు నేరుగా విమాన సర్వీసులను ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. 

Also Read: పిచ్చి తుగ్లక్ అని చదువుకున్నా.. ఇప్పుడు జగన్‌ని చూస్తున్నా, వైసీపీ పోతేనే ఏపీ అభివృద్ధి: చంద్రబాబు

గతంలో కడప నుంచి హైదరాబాద్ లేదా విజయవాడకు విమాన ప్రయాణం చేయాలంటే ప్రజలు తిరుపతి, చెన్నై, బెంగళూరుకు వెళ్లాల్సివచ్చేదని తెలిపారు. అందుకే 2018లో టీడీపీ ప్రభుత్వం కడప నుంచి వివిధ ప్రదేశాలకు విమాన సేవలను ప్రవేశపెట్టిందని వివరించారు. ఈ సేవలు ఇప్పుడు నిలిపేయడంతో పెట్టుబడిదారులే కాదు.. సామాన్య ప్రజలు సైతం ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అందుకే కడప నుంచి ఇతర ముఖ్య పట్టణాల మధ్య విమాన సేవలను పునరుద్ధరించాలని కోరారు.

click me!