రాజకీయాలకు దూరం: రాజ్యసభ సీటు ఆఫర్ మీద చిరంజీవి సంచలనం

By narsimha lodeFirst Published Jan 14, 2022, 4:31 PM IST
Highlights

రాజకీయాలకు తాను దూరంగా ఉన్నానని మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు. శుక్రవారం నాడు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు.

విజయవాడ: తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు. శుక్రవారం నాడు ఆయన vijayawadaలో మీడియాతో మాట్లాడారు. తనకు Rajya sabha పదవిని ఇస్తున్నారనే ప్రచారం ఊహాగానమేనని Chiranjeevi తేల్చి చెప్పారు.

ఈ ప్రచారాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టుగా చిరంజీవి చెప్పారు. politicsకు దూరంగా ఉన్న తనకు ఎవరూ కూడా ఈ రకమైణ పదవులను ఆఫర్ చేయబోరని చిరంజీవి అభిప్రాయపడ్డారు. రాజకీయ పదవుల కోసం జరిగే ప్రచారంపై తాను సమాధానం చెప్పబోనని చిరంజీవి తేల్చేశారు. రాజకీయ పదవుల కోసం లోబడడం కానీ, అలాంటి వాటిని కోరుకోవడం కూడా తన అభిమతం కాదని చిరంజీవి స్పష్టం చేశారు.

సినిమా టికెట్ ధరల తగ్గింపు విషయమై ఏపీ సీఎం వైఎస్ జగన్ తో  మెగాస్టార్ చిరంజీవి  గురువారం నాడు భేటీ అయ్యారు. ఈ భేటీ  తర్వాత చిరంజీవికి రాజ్యసభ పదవిని ఇస్తారనే ప్రచారం సాగుతుంది. ఈ ప్రచారాన్ని చిరంజీవి కొట్టిపారేశారు.  

 2009 ఎన్నికలకు ముందు చిరంజీవి ప్రజా రాజ్యం పార్టీని ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో Praja rajyam పార్టీ 18 ఎమ్మెల్యే స్థానాలను కైవసం చేసుకొంది. అయితే ప్రజా రాజ్యం పార్టీని ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో  ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి విలీనం చేశారు. ఈ విలీనం తర్వాత చిరంజీవికి కాంగ్రెస్ పార్టీ కేంద్ర మంత్రి పదవిని ఇచ్చింది. 2014 ఎన్నికలకు ముందు Congress పార్టీ ఉమ్మడి ఏపీ రాష్ట్రాన్ని విభజించింది.

అయితే ఉమ్మడి రాష్ట్ర విభజనను కాంగ్రెస్ పార్టీకి చెందిన అప్పటి కేంద్ర మంత్రులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తర్వాతి నుండి కూడా  చిరంజీవి  క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు కూడా చిరంజీవి దూరంగా ఉంటున్నారు అంతేకాదు ఆ పార్టీకి రాజీనామా చేసినట్టుగా కూడా ఆయన ప్రకటించలేదు.

చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా పనిచేశారు.  ప్రజా రాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత Pawan Kalyan చిరంజీవిని అనుసరించలేదు. అయితే 2014 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్  Janasena పార్టీని ఏర్పాటు చేశారు.ఆ ఎన్నికల్లో Andhra pradesh, Telanganaలో tdp, bjpకూటమి తరపున పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు. 

పవన్ కళ్యాణ్ పార్టీలో చిరంజీవి సోదరుడు Nagababu చేరారు. 2019 ఎన్నికల్లో నాగబాబు నర్సాపురం ఎంపీ స్థానం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.  అయితే చిరంజీవి మాత్రం పవన్ కళ్యాణ్ పార్టీకి కూడా దూరంగా ఉన్నాడు. 

అయితే ఏపీ సీఎం వైఎస్ జగన్ తో చిరంజీవి భేటీ  తర్వాత రాజ్యసభ సీటు ఆఫర్ అంటూ ప్రచారం సాగడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది.  ఈ చర్చకు చిరంజీవి స్వయంగా పుల్‌స్టాప్ పెట్టారు. తాను రాజకీయాలకే దూరంగా ఉన్నానని తేల్చేశారు.ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు స్వీకరించిన చిరంజీవి ఆయనతో రెండు దఫాలు భేటీ అయ్యారు. 2019 అక్టోబర్ 14వ తేదీన చిరంజీవి జగన్ తో భేటీ అయ్యారు. ఆ సమయంలో చిరంజీవి సైరా సినిమాలో నటించారు. ఆ తర్వాత సినిమా టికెట్ల ధరల తగ్గింపు విసయమై ఈ నెల 13న చిరంజీవి ఏపీ సీఎం జగన్ తో భేటీ అయ్యారు.

ట్విట్టర్ లో కూడా

తెలుగు సినీ పరిశ్రమ మేలుకోసం,థియేటర్ల మనుగడ కోసం,ఆంధ్రప్రదేశ్ సి.ఎం శ్రీ వై స్ జగన్ గారిని కలిసి చర్చించిన విషయాలని పక్కదోవ పట్టించే విధంగా,ఆ మీటింగ్ కి రాజకీయరంగు పులిమి నన్ను రాజ్యసభకు పంపుతున్నట్లు కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేస్తున్నాయి.అవన్నీ పూర్తిగా నిరాధారం.

— Chiranjeevi Konidela (@KChiruTweets)

 

రాజకీయాలకు దూరంగా ఉంటున్న  తాను మళ్లీ రాజకీయాల్లోకి చట్టసభల్లోకి రావడం జరగదని చిరంజీవి తేల్చి చెప్పారు. దయచేసి ఊహగానాలను నమ్మొద్దన్నారు. సీఎం జగన్ ను కలవడంపై కొందరు రాజకీయరంగు పులుముతున్నారన్నారు.  తనను రాజ్యసభకు పంపుతున్నారనే ప్రచారం పూర్తిగా అవాస్తవమన్నారు.  ఈ మేరకు ట్విట్టర్ వేదికగా కూడా చిరంజీవి తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. 

click me!