పవన్... ఎస్.. నేను అసెంబ్లీ రౌడీనే: చింతమనేని ప్రభాకర్

Published : Sep 27, 2018, 12:50 PM ISTUpdated : Sep 27, 2018, 01:07 PM IST
పవన్... ఎస్.. నేను అసెంబ్లీ రౌడీనే: చింతమనేని ప్రభాకర్

సారాంశం

ప్రజాపోరాట యాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనపై చేసిన ఆరోపణలపై స్పందించారు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. తాను అసెంబ్లీ రౌడీనే అని.. ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో రౌడీయిజం చేస్తానని ప్రభాకర్ అన్నారు.

పవన్‌కు చెందిన టీవీ ఛానెల్‌లో నన్ను అసెంబ్లీ రౌడీగా చిత్రీకరించారని.. ఆ సమయంలో వచ్చిన మా అబ్బాయి.. నాన్నా నువ్వు అసెంబ్లీ రౌడీవా అని అడిగాడని..అందుకు తాను అవును అన్నానని చింతమనేని తెలిపారు.

ఆ సినిమాలో శివాజీలాగే.. ప్రజల మద్దతుతో అవినీతిపరులపైనా.. సంఘ వ్యతిరేక శక్తుల మీదా గెలుస్తానన్నారు. రౌడీయిజం చేస్తే మక్కెలు విరగ్గొట్టిస్తానని ప్రభాకర్ ఆవేశంగా అన్నారు. తనకు నీతి, నిజాయితీ ఉందని.. బజారు మనిషిలా ఎప్పుడు ప్రవర్తించలేదన్నారు.

ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పదిన్నర వరకు తన జీవితం ప్రజాసేవకే అంకితమన్నారు. కాంగ్రెస్ చేస్తున్న అన్యాయాన్ని సహించలేక సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నానని.. ఇతర ప్రజా సమస్యల మీద ధర్నాలు చేశానని.. కానీ ఏ కేసును ఎత్తేయాలని దరఖాస్తు చేసుకోలేదన్నారు.

సైగ చేస్తే తన్ని తగలేస్తారు: చింతమనేనికి పవన్ హెచ్చరిక

ఎమ్మెల్యే చింతమనేనిపై పవన్ కల్యాణ్ ఘాటు వ్యాఖ్యలు

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం