అమెరికాలో చంద్రబాబుకి ...సెక్స్ రాకెట్ సెగ

Published : Sep 27, 2018, 10:04 AM IST
అమెరికాలో చంద్రబాబుకి ...సెక్స్ రాకెట్ సెగ

సారాంశం

దీంతో ఏం జరుగుతుందో తెలియక తొలుత అయోమయానికి లోనైన చంద్రబాబు.. తర్వాత ప్రసంగాన్ని ఆపి వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. 

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి అమెరికాలో చేదు అనుభవం ఎదురైంది. ఈ నెల 23న చంద్రబాబు అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా.. అక్కడ టీడీపీ ఎన్నారైలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం కి అనుకోని అనుభవం ఎదురైంది. సెక్స్ రాకెట్ సెగ తగిలింది.

న్యూజెర్సీలోని ఎన్నారైలు ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు తన ప్రసంగం ఏర్పాటు చేయగా..ఆయన ప్రసంగం ప్రారంభించగానే సభికుల నుంచి ప్రతిఘటన ఎదురైంది. సినీతారల సెక్స్‌ రాకెట్‌లో నిందితులు మీ పక్కన కూర్చుని ఉన్నారని, ముందు వారిని వేదిక నుంచి కిందకు దించాలంటూ కేకలకు దిగారు. వారి అరుపులు, కేకలతో సభలో తీవ్ర కలకలం రేగింది. దీంతో ఏం జరుగుతుందో తెలియక తొలుత అయోమయానికి లోనైన చంద్రబాబు.. తర్వాత ప్రసంగాన్ని ఆపి వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. 

ఈలోగా కార్యక్రమ నిర్వాహకులు జోక్యం చేసుకుని సెక్స్‌రాకెట్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న వారిని సముదాయించారు. టీడీపీ ఎన్నారైల నుంచి ఊహించని రీతిలో చేదు అనుభవం ఎదురవడంతో కంగుతిన్న సీఎం చంద్రబాబు అనంతరం ప్రసంగాన్ని కొనసాగించినప్పటికీ ఏపీలో మావోయిస్టులు టీడీపీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను హత్య చేశారని, వారి మృతికి తన సంతాపం తెలుపుతున్నానంటూ తన ఉపన్యాసాన్ని ముగించేయడం గమనార్హం.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు.. ఈ నాలుగు జిల్లాల్లో అల్లకల్లోలమే
Varudu Kalyani: ఆవకాయ ఫెస్టివల్ కి డబ్బులుంటాయి.. ఆడబిడ్డ నిధికి డబ్బులుండవా? | Asianet News Telugu