
ఏలూరు : ఇటీవల బి. సింగవరంలో నాపై Eve teasing case పెట్టారు ఇంతకంటే దారుణం ఉంటుందా? అయినా నాది ఈవ్ టీజింగ్గ్ చేసే వయసా? ఎవరైనా చెప్పండి’ అంటూ దెందులూరు మాజీ ఎమ్మెల్యే Chintamaneni Prabhakar ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘నేను దేనికీ భయపడేది లేదు. ఈరోజు నేను పోతే నా వెనక ఉన్నవాడు వచ్చి పోరాడతాడు. రెండు రోజుల క్రితం ఓ అగంతకుడు ఫోన్ చేసి నన్ను చంపడానికి షూటర్ ను పురమాయించారు అని threat phone calls బెదిరించాడు. ఆగంతకుడి ఫోన్ నెంబర్, కాల్ రికార్డింగ్ తో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదు’ అంటూ ఏలూరు స్పందనలో సోమవారం ఇన్చార్జి కలెక్టర్ అరుణ్ బాబుకు ఫిర్యాదు చేశారు.
ఆ తర్వాత విలేకరులతో మాట్లాడుతూ ‘నన్ను హతమార్చేందుకు కుట్ర జరుగుతుంది, వైసిపి ప్రభుత్వం ఇప్పటికే నాపై 26 కేసులు నమోదు చేసింది. అందులో ఎస్సీ, ఎస్టీ కేసులు బనాయించారు. సీఎం జగన్ కు దమ్ము, ధైర్యం ఉంటే ఒక ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి విచారణ చేయించాలి. మంత్రులు జోగి రమేష్, కొట్టు సత్యనారాయణ, వై వి సుబ్బారెడ్డిలు నేను ఏమిటో తెలుసుకుని మాట్లాడాలి’ అన్నారు. దిశ డీఎస్సీ సత్యనారాయణ తన పై ఉద్దేశపూర్వకంగా కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.
కాగా, జూన్ 5న టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కి బెదిరింపు పోన్ కాల్స్ వచ్చాయి. నిన్ను చంపేందుకు మా బాస్ షూటర్ ను నియమించాడని ఓ ఆగంతకుడు తనకు ఫోన్ చేశాడని చింమనేని ప్రభాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శనివారం నాడు రాత్రి ఈ ఫోన్ వచ్చిందని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఏలూరు త్రీటౌన్ పోలీసులకు ఇచ్చిన పిర్యాదులో పేర్కొన్నారు. గన్ మెన్ల జీతాలకు వ్యక్తిగతంగా డబ్బు చెల్లించే ఆర్థిక స్థోమత తనకు లేదన్నారు. తనకు పోలీసులే ఉచితంగా సెక్యూరిటీ కల్పించాలని దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కోరారు.
గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి అబ్బయ్య చౌదరి చేతుల్లో ఓడిన చింతమనేని ప్రభాకర్ ఇబ్బందులు పడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తన,పై అక్రమంగా కేసులు బనాయిస్తుందని ఆయన ఆరోపించారు. గత ఏడాది ఆగష్టులో పోలీసులు చింతమనేనిని అరెస్ట్ చేశారు. పెట్రోల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ దెందులూరులో చింతమనేని ఆందోళన చేపట్టారు. ఎమ్మార్వో ఆఫీసుకు వెళ్తుండగా ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసు విధులకు ఆటంకం కలిగించారని చింతమనేనిపై కేసు నమోదు చేశారు. అనంతరం నర్సీపట్నంలో ఓ వివాహ వేడుకకు హాజరైన చింతమనేనిని అరెస్ట్ చేసిన పోలీసులు ఏలూరు తరలించారు. అంతకు ముందు కూడా ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.
తనను ఎన్‌కౌంటర్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నిందని చింతమనేని ప్రభాకర్ ఇటీవలనే ఏపీ ప్రభుత్వం పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. తనను ఎన్ కౌంటర్ చేసేందుకు ఇప్పటికే రెండు దఫాలు ప్రయత్నించి విఫలమైనట్టుగా ఆయన చెప్పార.. టీడీపీ నాయకులు స్పందించకుంటే ఎప్పుడో చనిపోయేవాడినని చెప్పారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ప్రశ్నించినందుకు తనపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తన లాయర్‌కు సజ్జల వార్నింగ్ ఇచ్చారని కూడా చింతమనేని ప్రభాకర్ ఆరోపణలు చేశారు. ఈ విషయమై తనకు ప్రాణహాని ఉందని ఏలూరు కోర్టును ఆయన ఆశ్రయించారు.