దెందులూరులో అర్ధరాత్రి ఉద్రిక్తత.. పోలీసు స్టేషన్ వద్ద వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ

Published : Jun 08, 2022, 09:37 AM IST
దెందులూరులో అర్ధరాత్రి ఉద్రిక్తత.. పోలీసు స్టేషన్ వద్ద వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య  ఘర్షణ

సారాంశం

ఏలూరులోని దెందులూరులో అర్ధరాత్రి ఉద్రికత్త చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్‌‌ వద్ద వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇందులో పలువురికి గాయాలు అయ్యాయి

ఏలూరులోని దెందులూరులో అర్ధరాత్రి ఉద్రికత్త చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్‌‌ వద్ద వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇందులో పలువురికి గాయాలు అయ్యాయి. ఇరువర్గాల మధ్య ఘర్షణకు సోషల్ మీడియా పోస్టింగ్స్ కారణంగా తెలుస్తోంది. వివరాలు.. శ్రీరామవరానికి చెందిన ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌లో మరో వ్యక్తిని కించపరుస్తూ పోస్టు పెట్టారు. దీన్ని జీర్ణించుకోలేని ప్రత్యర్థులు పోస్టు పెట్టిన వ్యక్తిపై దాడి చేయాలని భావించారు. ఈ క్రమంలోనే దెందులూరు పోలీసులు ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టిన వ్యక్తిని ముందే స్టేషన్‌కు తరలించారు. 

ఈ క్రమంలోనే టీడీపీ, వైసీపీ వర్గాలకు చెందినవారు పోలీసు స్టేషన్‌ వద్దకు చేరుకున్నారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం కాస్తా.. ఘర్షణకు దారితీసింది. ఇరువర్గాలకు చెందిన వ్యక్తులు కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఎస్‌ఐ వీర్రాజుతోపాటు ఇరువర్గాలకు చెందిన పలువురికి గాయాలు అయ్యాయి. అయితే పరిస్థితి అదుపుదాటడంతో.. ఏలూరు డీఎస్పీ పైడేశ్వరరావు నియోజకవర్గంలోని ఎస్‌ఐలు, ఏలూరు నగరంలోని సీఐలతో దెందులూరు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి పరిస్థితిని అదుపు చేశారు. 

ఈ ఘటనలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఏలూరు ఆస్పత్రికి తరలించారు.  శ్రీరామవరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక బలగాలను మోహరించారు.

PREV
click me!

Recommended Stories

10వేల కోట్ల పెట్టుబ‌డులు, 4వేల మందికి ఉద్యోగాలు ఏపీలో భారీ ప్రాజెక్టు| Anantapur Wind Energy Project
జగన్‌కు రాఖీలు కట్టిన వైసీపీ కార్యకర్తలు | YS Jagan Celebrate Rakhi Pournami