ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి ఎమ్మెల్యేకు ప్రమాదం జరిగింది. విద్యుత్ స్థంభాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కారులో బెలూన్లు తెరుచుకోవడంతో ఎమ్మెల్యే సహా ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.
ఏలూరు:ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని చింతలపూడి ఎమ్మెల్యేకు ప్రమాదం తప్పింది.ఎమ్మెల్యే ఎలీజా తన కుటుంబ సభ్యులతో కారులో వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అడమిల్లిలో విద్యుత్ స్థంభాన్ని కారు ఢీకొట్టింది. దీంతో కారు బెలూన్లు తెరుచుకున్నాయి. బెలూన్లు తెరుచుకోవడంతో ఎమ్మెల్యే సహా కారులో ఉన్నవారంతా క్షేమంగా ఉన్నారు.
హైద్రాబాద్ నుండి జంగారెడ్డిగూడెం వస్తున్న సమయంలో మంగళవారంనాడు తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది.జిల్లాలోని కామవరపుకోట మండలం అడమిల్లి వద్ద ఎమ్మెల్యే ప్రయాణీస్తున్న కారు అదుపుతప్పి విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టింది. ప్రమాదం నుండి బయటపడిన ఎమ్మెల్యే తన కుటుంబ సభ్యులతో మరో కారులో జంగారెడ్డిగూడెనికి చేరుకున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.