ఎలమంచిలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

Published : Mar 25, 2024, 08:16 PM ISTUpdated : Mar 25, 2024, 08:21 PM IST
ఎలమంచిలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

సారాంశం

అనకాపల్లి జిల్లాలోని మరో అసెంబ్లీ నియోజకవర్గం ఎలమంచిలి. ఇక్కడ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి గెలిచింది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు (కన్నబాబు రాజు) పై నమ్మకంతో మరోసారి ఆయననే బరిలోకి దింపారు వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇక ప్రతిపక్ష కూటమి పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని జనసేనకు కేటాయించారు. దీంతో ఎలమంచిలి  ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.  

ఎలమంచిలి నియోజకవర్గ రాజకీయాలు :

ఆంధ్ర ప్రదేశ్ లో అటు టిడిపి, ఇటు జనసేన రెండూ బలంగా వున్న నియోజకవర్గాల్లో ఎలమంచిలి ఒకటి.  ఇక్కడ 1983 నుండి  2004 వరకు అంటే వరుసగా ఐదు అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపిదే విజయం. మొదటిసారి కెకెవి సత్యనారాయణరాజు, ఆ తర్వాత వరుసగా 1985,1989, 1994, 1999 ఎన్నికల్లో పప్పల చలపతిరావు గెలుపొందారు. ఇక 2014లో పంచకర్ల రమేష్ బాబు టిడిపి నుండి పోటీచేసి గెలిచారు. 

ఇక టిడిపితో పాటు వైసిపి కూడా ఎలమంచిలిలో స్ట్రాంగ్ గానే వుంది. కాంగ్రెస్ నుండి 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన  కన్నబాబు వైసిపిలో చేరి 2019లో పోటిచేసారు. ఇలా మొత్తంగా మూడోసారి, వైసిపి తరపున రెండోసారి ఎలమంచిలిలో గెలిచారు. ఇప్పుడు మరోసారి యలమంచిలిలో విజయంపై ధీమాతో వున్నాడు.   

ఎలమంచిలి నియోజకవర్గ పరిధిలోని  మండలాలు :

1. రాంబిల్లి  
2.  మునగపాక
3. అచ్యుతాపురం
4. ఎలమంచిలి 

ఎలమంచిలి అసెంబ్లీ ఓటర్లు : 

నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) - 1,98,556
పురుషులు -    97,940 
మహిళలు ‌-    1,00,605

ఎలమంచిలి అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు : 

వైసిపి అభ్యర్థి :

ఎలమంచిలి నియోజకవర్గంలో వైసిపి ఎలాంటి ప్రయోగాలు చేయలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజునే మళ్లీ బరిలో దింపింది.   

జనసేన అభ్యర్థి : 

ప్రతిపక్ష కూటమి అభ్యర్థిగా సుందరపు విజయ్ కుమార్ ఎలమంచిలిలో పోటీ చేస్తున్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూడా బలంగానే వున్నా పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించారు. 

ఎలమంచిలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు :

ఎలమంచిలి అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు : 

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,68,766 (85 శాతం)

వైసిపి - ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు - 71,934 ఓట్లు (42 శాతం) - 4,146 ఓట్ల మెజారిటీతో విజయం 

టిడిపి  ‌- పంచకర్ల రమేష్ బాబు - 67,788 (40  శాతం) - ఓటమి

జనసేన పార్టీ - సుందరపు విజయ్ కుమార్ ‌- 19,774 (11 శాతం)

ఎలమంచిలి అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,59,218 ఓట్లు (85 శాతం)

టిడిపి - పంచకర్ల రమేష్ బాబు - 80,563 (50 శాతం) - 8,375 ఓట్ల మెజారిటీతో విజయం 

వైసిపి - ప్రగడ నాగేశ్వరరావు - 72,188 (45 శాతం) - ఓటమి


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం