తిరుమల నడక మార్గంలో రెండు రోజుల క్రితం చిరుత దాడిలో ఆరేళ్ల చిన్నారి మృతి ఘటనపై నివేదిక ఇవ్వాలని చైల్డ్ రైట్స్ కమిషన్ టీటీడీని ఆదేశించింది.
తిరుమల: తిరుమల నడక మార్గంలో రెండు రోజుల క్రితం చిరుత దాడిలో ఆరేళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ విషయమై చైల్డ్ రైట్స్ కమిషన్ టీటీడీని నివేదిక కోరింది.ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన ఆరేళ్ల చిన్నారి లక్షిత చిరుత దాడిలో మృతి చెందింది. నెల్లూరు జిల్లాలోని కోవూరు మండలం పోతిరెడ్డిపాలెంకు చెందిన దినేష్ కుమార్, శశికళ దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి శుక్రవారం నాడు వచ్చారు. అయితే అదే రోజు రాత్రి ఏడున్నర గంటల సమయంలో నరసింహస్వామి ఆలయం వద్ద బాలిక తప్పిపోయింది. అయితే ఈ నెల 12వ తేదీన లక్షిత డెడ్ బాడీని అటవీ ప్రాంతంలో గుర్తించారు.
also read:15 ఏళ్లలోపు పిల్లలకు మధ్యాహ్నం రెండు దాటితే నో ఎంట్రీ: చిరుత దాడితో టీటీడీ కీలక నిర్ణయం
ఇటీవల కాలంలో తిరుమల నడక మార్గంలో చిరుతల కదలికలు ఎక్కువగా ఉన్నాయి. ఇటీవల కాలంలోనే ఇద్దరు చిన్నారులపై చిరుతలు దాడి చేశాయి. లక్షిత మరణించగా, మరో మూడేళ్ల చిన్నారి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ పరిస్థితుల నేపథ్యంలో నడక మార్గంలో భక్తుల భద్రతకు టీటీడీ కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంది. భక్తులను గుంపులుగా గుంపులుగానే నడక మార్గంలో అనుమతిస్తున్నారు. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల ద్వారా మధ్యాహ్నం రెండు గంటల తర్వాత 15 ఏళ్లలోపు పిల్లలుంటే నడక మార్గంలో అనుమతివ్వడం లేదు. సాయంత్రం ఆరు గంటలు దాటితే రెండో ఘాట్ రోడ్డులో కూడ టూ వీలర్లకు అనుమతిని టీటీడీ నిరాకరించింది