చిన్న వయసులో పెద్ద సాయం... స్నేహితురాలికి అమ్మఒడి డబ్బులతో సాయం

By Arun Kumar PFirst Published Mar 17, 2021, 9:29 AM IST
Highlights

తల్లిదండ్రుల ప్రేమకు దూరమై బాధలో వున్న తోటి విద్యార్థికి ఆర్థిక కష్టాలు ధరిచేరనివ్వకుండా తన వంతు సాయంచేసి పసి హృదయాల్లో మానవత్వం ఇంకా బ్రతికేవుందని నిరూపించింది ఓ చిన్నాారి. 

గుంటూరు: ఆ అమ్మాయి వయసు మాత్రమే చిన్న మనసు మాత్రం వెన్న. తల్లిదండ్రుల ప్రేమకు దూరమై బాధలో వున్న తోటి విద్యార్థికి ఆర్థిక కష్టాలు ధరిచేరనివ్వకుండా తన వంతు సాయంచేసి పసి  హృదయాల్లో మానవత్వం ఇంకా బ్రతికేవుందని నిరూపించింది. తనకి వచ్చిన అమ్మఒడి డబ్బులోంచి 3000 రూపాయలను అందించి స్నేహానికి అసలైన నిదర్శనంగా నిలిచింది. వయసుకు మించిన పనిని చేసిన చిట్టితల్లి ఇప్పుడు అందరి అభినందనలు అందుకుంటోంది. 

గుంటూరు జిల్లా కారంపూడి మండలంలోని ఒప్పిచర్ల గ్రామానికి చెందిన మాదల శ్రీదేవి  అనే చిన్నారిని తల్లిదండ్రులు వివిధ కారణాలతో  వదికేసి వెళ్లిపోయారు. ఆ అమ్మాయికి నాయనమ్మ అన్నీ తానై కష్టపడుతూ పోషిస్తోంది. తమలాగే తమ పిల్లలు కూడా కష్టాలు పడకూడదు అనే ఉదేశ్యంతో మనవరాలిని ఎన్ని కష్టాలు వచ్చిన పెంచుతూ చదివిస్తుంది.  తన మనవరాలు మంచి ఉన్నత స్థానానికి ఎదగాలని కోటి ఆశలతో  చదివిస్తుంది.   
 
ఆర్థిక ఇబ్బందులు ఒకపక్క, కుమారుడు కోడలు లేని బాధ ఒక పక్క ఉన్నా అన్నింటినీ దిగమింగుకొని ఆ వృద్దులు మనవరాలిని గ్రామంలోని ఎంపిపి స్కూల్  లో చదవిస్తోంది. అయితే  శ్రీదేవితో పాటు అదే గ్రామానికి వంకాయలపాటి భువనేశ్వరి అనే విద్యార్థి కూడా చదువుతోంది. తల్లిదండ్రులకు దూరమై, ఆర్ధిక ఇబ్బందులతో ఉన్న తోటి  ఫ్రెండ్ కి ఏమైనా చెయ్యాలి అనే ఆలోచన  భువనేశ్వరికి వచ్చింది. దీంతో     రాష్ట్ర ప్రభుత్వం తనకు ఇస్తున్న అమ్మవడి పథకంలో నుంచి 3000 రూపాయలు తన తోటి విద్యార్థి శ్రీదేవికి అందించింది.  ఇంత చిన్నవయసులోనే అంత పెద్ద మనసును చూసి ఉన్న భువనేశ్వరి ని చూసి ఆ స్కూలు ఉపాధ్యాయులు మరియు గ్రామ పెద్దలు అందరూ అభినందించారు. 
 

click me!