మంత్రి రోజా నా క్లాస్ మేట్: ఉమ్మారెడ్డి..!

Published : Sep 16, 2022, 10:24 AM IST
మంత్రి రోజా నా క్లాస్ మేట్: ఉమ్మారెడ్డి..!

సారాంశం

శాసనసభా ప్రాంగణంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు మంత్రి రోజా ఎదురయ్యారు. వెంటనే ఉమ్మారెడ్డి.. ఆమెను పలకరించారు. అది గమనించని రోజా.. మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఉన్నారు. 

ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా.. తాను క్లాస్ మేట్స్ అని శాసనమండలి లో చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.. ఆ సమయంలో  ఆయన ఈ విషయాన్ని మీడియా ముందు చెప్పడం విశేషం.

అసలు ఏం జరిగిందంటే... శాసనసభా ప్రాంగణంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు మంత్రి రోజా ఎదురయ్యారు. వెంటనే ఉమ్మారెడ్డి.. ఆమెను పలకరించారు. అది గమనించని రోజా.. మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఉన్నారు. దీంతో...ఉమ్మారెడ్డి అక్కడకు వచ్చి.. తాను ముందు పలకరించానని పట్టించుకోలేదని ప్రశ్నించారు. ‘నేను ఎదురుగా వచ్చి పలకరిస్తే నన్ను కాదని మీడియా ప్రతినిధితో మాట్లాడతావా? నేను సీనియర్‌ని. నన్ను పలుకరించలేదు. నేను హర్ట్‌ అయ్యాను’ అని రోజాతో నవ్వుతూ అన్నారు.

ఆ తర్వాత మీడియా ప్రతినిధులతో.. తాను, మంత్రి రోజా క్లాస్ మేట్స్ అని చెప్పడం గమనార్హం. అయితే... మీరిద్దరూ ఒకే ఏజ్ వాళ్లా అని మీడియా వారు సందేహం వ్యక్తం చేయగా.. ఒకే క్లాస్ లో చదువుకున్నాం అంటే.. అర్థం అదేగా అని రోజా కూడా నవ్వుతూ చెప్పడం విశేషం. అయితే... వారు సరదాగా... ఈ విషయాన్ని చెప్పడం గమనార్హం. నిజానికి  వారిద్దరికీ ఏజ్ గ్యాప్ చాలా ఎక్కువ. సరదా కోసం ఆయన అలా చెప్పారు. ఆయన చెప్పిన దానికి రోజా ఎదురు చెప్పకుండా నవ్వేయడం విశేషం.

PREV
click me!

Recommended Stories

Vijaysai Reddy Sensational Comments On YS Jagan | Asianet News Telugu
Annadata Sukhibhava: రైతుల‌కు ద‌స‌రా కానుక‌.. ఖాతాల్లోకి రూ. 6000 జ‌మ‌, ఎప్పుడంటే.?