మళ్లీ పెరిగిన చికెన్ ధరలు.. వానాకాలం వచ్చినా దిగిరానంటూ...

By AN TeluguFirst Published Jul 7, 2021, 12:17 PM IST
Highlights

చికెన్ రేట్లు మళ్లీ కొండెక్కి కూర్చున్నాయి. ఎప్పుడూ సమ్మర్ లో పెరిగే చికెన్ ధరలు వానాకాలం వచ్చినా దిగి రావడం లేదు. మరోవైపు కరోనా నేపథ్యంలో పోషకాహారం తీసుకోవాలని డాక్టర్లు  సూచిస్తున్న నేపథ్యంలో చికెన్ ధరలు అమాంతం పెరిగి పోతున్నాయి. 

గత వారం గత వారం రోజుల వ్యవధిలో కిలో చికెన్  ధర 100 రూపాయలకు పైగానే పెరిగిందంటే...ఎంత డిమాండ్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. గత ఆదివారం రూ. 280 ఉన్న కిలో చికెన్ ధన మంగళవారానికి రూ. 15 పెరిగి 300 కు చేరుకుంది.

మార్కెట్లో డిమాండ్ పెరగడంతో చికెన్ వ్యాపారులు ధరలను విపరీతంగా పెంచేస్తున్నారు దీనిపై అధికారులు నియంత్రణ లేకపోవడంతో ఇష్టానుసారంగా ధరలు పెంచుతున్నారు.  హోల్సేల్ క్రయవిక్రయాలలో ధరలు బాగానే ఉన్నా.. రీటైల్ లో కొనే వారికి మాత్రం జేబులు చిల్లు పడక తప్పడం లేదు.

click me!