చికెన్, మటన్ వండలేదని.. పురుగులమందు తాగి...

Published : Apr 19, 2021, 10:57 AM IST
చికెన్, మటన్ వండలేదని.. పురుగులమందు తాగి...

సారాంశం

మటన్, చికెన్ కూరలు వండలేదని భార్య మీద అలిగి క్షణికావేశంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ షాకింగ్ ఘటన తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలులో జరిగింది.  

మటన్, చికెన్ కూరలు వండలేదని భార్య మీద అలిగి క్షణికావేశంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ షాకింగ్ ఘటన తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలులో జరిగింది.

క్షణికావేశం ఎంత దారుణమైన పరిస్థితులకు దారి తీస్తుందో ఈ ఘటన తెలుపుతుంది. 30 ఏళ్ల దాంపత్య జీవితం ఆ భర్తలో మార్పును తీసుకురాలేకపోయింది. ఆవేశం తప్ప ఆలోచనను కలిగించలేకపోయింది. 

కేవలం తాను తెచ్చిన కూర వండను అన్నందుకు భార్యపై కోపంతో మనస్థాపానికి గురై తన జీవితాన్ని అంతం చేసుకునేలా చేసింది. ఏకంగా ప్రాణాలే తీసుకోవడంతో ఆ కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది.

శనివారం రాత్రి ఈ ఘటన గొల్లప్రోలు మండలం కొడవలిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం కొడవలికి చెందిన సిహెచ్  త్రిమూర్తులు (50)  రైతు. వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

శనివారం సాయంత్రం మార్కెట్ కి వెళ్లి చికెన్, మటన్ రెండు కూరలు తీసుకొచ్చాడు. రెండు కూరలూ వండాలని భార్యకు చెప్పాడు. అయితే తెల్లవారితే ఆదివారం కాబట్టి  ఇప్పుడు ఒకటి.. రేపు ఇంకొకటి వండుతానని భార్య చెప్పింది.  

దీంతో త్రిమూర్తులు కోపానికి వచ్చాడు. రెండు ఇప్పుడే వండాలంటూ పట్టుబట్టాడు. తన మాట విన లేదంటూ గొడవకు దిగాడు. ఆ తరువాత కోపంతో బయటకు వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

ఈ విషయం తెలుసుకున్న బంధువులు వెంటనే అతడి పత్తిపాడు పీహెచ్‌సీకి తీసుకెళ్లగా ప్రథమ చికిత్స తర్వాత కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ త్రిమూర్తులు ఆదివారం ఉదయం మృతి చెందినట్లు గొల్లప్రోలు ఎస్సై రామలింగేశ్వర రావు తెలిపారు. అతడికి భార్య, కుమారుడు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Manchu Family Visits Tirumala: తిరుమల శ్రీవారి సేవలో మంచు ఫ్యామిలీ | Asianet News Telugu
PSLV-C62 EOS-N1 Launch: ఇస్రో ప్రయోగంపై సైంటిస్టులు, స్టూడెంట్స్ రియాక్షన్ | Asianet News Telugu