వైసీపీ రంగురాళ్లకోసం బరితెగించి.. మైనర్ల ప్రాణాలతో చెలగాటం.. నారా లోకేష్

Published : Apr 19, 2021, 09:59 AM ISTUpdated : Apr 19, 2021, 10:02 AM IST
వైసీపీ రంగురాళ్లకోసం బరితెగించి.. మైనర్ల ప్రాణాలతో చెలగాటం.. నారా లోకేష్

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవరత్నాలు అని చెబుతూ ప్రజల కళ్ళుగప్పి మాయ చేస్తుంటే.. ఇదే అదనుగా వైసీపీ నేతలు ఇసుక, మట్టి మొదలుకుని ఎర్రచందనం వరకు కాదేదీ దోపిడీకి అనర్హం అన్నట్టు దోచుకుంటున్నారు అంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ మీద విరుచుకుపడ్డారు.

ఇప్పుడు కొత్తగా అలెగ్జాండరైట్ రంగురాళ్ల అక్రమ తవ్వకం బయటపడిందని మండిపడ్డారు. విశాఖజిల్లా, గొలుగొండ మండలంలో నర్సీపట్నం వైసీపీ ఎమ్మెల్యే అనుచరులు అత్యంత విలువైన అలెగ్జాండరైట్ రంగురాళ్ల కోసం సాలికమల్లవరం రిజర్వ్ ఫారెస్ట్ లో జేసీబీలను పట్టుకుని వెళ్ళి మరీ యథేచ్ఛగా తవ్వకాలు సాగిస్తున్నారని ఆరోపించారు. 

వైసీపీ ఎమ్మెల్యేలు అధికారం ఉంది కదా అని అటవీ సిబ్బందిని కూడా బెదిరిస్తున్నారంటే ఎంత బరి తెగింపో అర్ధమవుతోందన్నారు. వైసీపీ నేతలు వాళ్ళ స్వార్థం కోసం ఇంకా క్రూరంగా, చిన్నారులతో అడవుల్లో ప్రమాదకరమైన సొరంగాలు తవ్విస్తున్నారన్నారు.

ఆ పిల్లలకు ఏమైనా జరిగితే బాద్యులెవరు? అని ప్రశ్నించారు. ఒకవైపు అక్రమ తవ్వకం, మరోవైపు మైనర్ల ప్రాణాలతో చెలగాటం..ఈ నేరాలకు ముఖ్యమంత్రి ఏం సమాధానం చెప్తారు? అని అడిగారు.

ఇంత అన్యాయం జరుగుతుంటే.. పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారు? తమకు తెలియాలని డిమాండ్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?