ఇండియా-చైనా వివాదం... ప్రధాని తన సలహా కోరినట్లు ట్వీట్: చంద్రబాబు సీరియస్

By Arun Kumar PFirst Published Jun 19, 2020, 12:29 PM IST
Highlights

సోషల్ మీడియాలో తన పేరుతో కొందరు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 

అమరావతి: సోషల్ మీడియాలో తన పేరుతో కొందరు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తన ప్రమేయం లేకుండానే తాను చేసినట్లుగా కొన్ని ఫేక్ ట్వీట్ లు ప్రచారవుతున్నాయని అన్నారు. ఇలాంటి పనులు క్రిమినల్స్  వైఎస్ జగన్ మరియు అతని అనుచరవర్గానికే సాధ్యమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.   

ఇటీవల సరిహద్దుల్లో భారత సైనికులను చైనా పొట్టపెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియా - చైనాల మధ్య వివాదం చోటుచేసుకోగా ప్రధాని  మోదీ చంద్రబాబుకు ఫోన్ చేసి సలహాలు అడిగారట. ఇలా ప్రధాని ఫోన్ చేసినట్లుగా చంద్రబాబు పేరుతో ఒక ఫేక్ ట్వీట్ సోషల్ మీడియాలో బాగా ప్రచారమవుతోంది. ఇలా తాను చెయ్యని ట్వీట్ లను మార్ఫింగ్ లతో తనకు ఆపాదించడం పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

read more    మొగుడ్ని కొట్టి మొగసాలకెక్కినట్లు... మండలి పరిణామాలపై మాజీ మంత్రి సంచలనం

'' కేవలం వైఎస్ జగన్ మరియు అతని అనుచరులు లాంటి క్రిమినల్స్ కే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. మార్పింగ్ ఫోటోలు, ఫేక్ వార్తలను ప్రచారం చేసి అవమానించాలని చూస్తారు. ప్రస్తుత విపత్కర సమయంలో వైసిపి ఇటువంటి నకిలీ పోస్టులను వ్యాప్తి చేయడాన్ని చూస్తే నిజంగా అసహ్యం వేస్తోంది'' అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. 

Only criminals like and his cronies can think of ways to demean, disgrace someone by spreading fake news and morphed images. Really disgusting to see YSRCP spread such fake posts during such volatile times pic.twitter.com/jiCYLAyeIr

— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn)

 

click me!