జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు హరిరామ జోగయ్య మరో లేఖాస్త్రం సంధించారు.
అమరావతి:జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కాపు సంక్షేమసేన వ్యవస్థాపకుడు మాజీ మంత్రి చేగోండి హరిరామ జోగయ్య శుక్రవారం నాడు మరో లేఖ రాశారు.జరుగుతున్న పరిణామాలను చూస్తే మిత్రులెవరో, శత్రువులెవరో తెలుసుకోవాలని ఆ లేఖలో హరిరామ జోగయ్య కోరారు. వెన్నుపోటుకు అలవాటుపడ్డ చంద్రబాబు పవన్ కు ప్రాధాన్యత ఇస్తారంటే ఎవరూ నమ్మరని ఆయన అభిప్రాయపడ్డారు.జనసేన మద్దతు లేకుండా ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించే అవకాశం లేదని ఆ లేఖలో హరిరామ జోగయ్య చెప్పారు.ఎన్నికలలోపే జనసేనను నిర్వీర్యం చేసి లోకేష్ ను చంద్రబాబు సీఎం చేస్తారని హరిరామ జోగయ్య తెలిపారు.
also read:రెండో జాబితాపై టీడీపీ-జనసేన కసరత్తు: సీనియర్లకు చోటు?
undefined
తన సలహాలు పవన్ కు నచ్చినట్టు లేవన్నారు.లోకేష్ ను సీఎం చేస్తారన్న భయం కార్యకర్తల్లో ఉందని హరిరామ జోగయ్య చెప్పారు.ఎన్నికలకు ముందే పవన్ స్థానం ఏమిటో చెప్పాలని కార్యకర్తల తరపున డిమాండ్ చేస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. తనను వైఎస్ఆర్‌సీపీ కోవర్టుగా చిత్రీకరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ప్యాకేజీ వీరుడంటూ పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తుంటే చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారని హరిరామ జోగయ్య ప్రశ్నించారు.
also read:లాస్య నందిత మృతి:పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు, టిప్పర్ గుర్తింపు
పవన్ కు ఇష్టమున్నా లేకున్నా ఆయన వెంటే ఉంటానని ఆయన స్పష్టం చేశారు.పవన్ ను కాపాడుకోవడం తన బాధ్యతగా భావిస్తానని ఆయన చెప్పారు.చచ్చేవరకు నా ప్రవర్తన ఇలాగే ఉంటుందన్నారు.పవన్ లక్ష్యానికి ఎప్పుడూ తన మద్దతు ఉంటుందని ఆయన తేల్చి చెప్పారు.