
కాపు సంక్షేమ సేన (kapu samkshema sena) ఫౌండర్ చేగొండి హరిరామ జోగయ్య (chegondi harirama jogaiah)కీలక ప్రకటన చేశారు. జనసేనను కాదని వేరే పార్టీ పెట్టాలన్న .. కాపు నేతల ఆలోచన వైసీపీ వ్యూహంలో భాగమేనంటూ ఆయన సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌లో సమావేశమైన కాపు నేతల్లో పార్టీ పెట్టి నడిపే శక్తి ఎవరికీ లేదని జోగయ్య అన్నారు. జనసేనను కాదని కొత్త పార్టీ పెడితే కాపు ఓట్లు చీలడమేనని ఆయన అభిప్రాయపడ్డారు.
కాగా.. Andhra pradesh రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటు విషయమై Kapu సామాజిక వర్గానికి చెందిన నేతలు ఇటీవల సమావేశమయ్యారు. కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు గత ఏడాది డిసెంబర్ మాసంలో Hyderabad వేదికగా సమావేశమయ్యారు. అదే సమయంలో Dalita, B.c నేతలు కూడా ముద్రగడ పద్మనాభంతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో కాపులకు రాజకీయ అధికారం విషయమై చర్చించారు.ఈ సమావేశాల తర్వాత ముద్రగడ పద్మనాభం ఈ లేఖ రాయడం రాజకీయంగా చర్చకు దారి తీసింది.
కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు వరుసగా సమావేశమైన సమయంలో రాష్ట్రంలో పార్టీల పరిస్థితిపై కూడా చర్చించారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ లు పార్టీలు ఏర్పాటు చేసి రాజకీయంగా విఫలమయ్యారనే చర్చ కూడా ఈ సమావేశాల్లో కొందరు కాపు నేతలు అభిప్రాయపడినట్టుగా సమాచారం. కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు సమావేశం కావడాన్ని ఏపీలోని ప్రధాన పార్టీలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. అధికారంలో ఉన్న వైసీపీ, విపక్ష టీడీపీలు ఈ సమావేశాలపై ఆరా తీస్తున్నాయి. అయితే కాపు సామాజిక వర్గం నేతలు సమావేశం కావడంపై టీడీపీ సమాచార సేకరణలో ఉందని తెలుస్తోంది. ఈ సమావేశాల వెనుక ఎవరున్నారనే విషయమై ఆ పార్టీ నాయకత్వం కేంద్రీకరించిందని సమాచారం.
Also Read:ఏపీలో మారుతున్న కాపు రాజకీయం: పార్టీలకతీతంగా ఒక్కటవుతున్న నేతలు, శాసించేది తామేనన్న గంటా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు సుమారు 12 శాతం ఉంటారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కాపు సామాజిక ఓటర్లు ప్రధాన పాత్ర పోషిస్తారు.ఈ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. అయితే కాపులు రాజకీయాధికారాన్ని దక్కించుకోవడం కోసం సమావేశాలు నిర్వహించడం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు భవిష్యత్తులో కూడా ప్రత్యామ్నాయ వేదిక గురించి సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నారు. అయితే కులం వేదికగా పార్టీ ఏర్పాటు చేస్తే ఆ పార్టీకి రాజకీయంగా మనుగడ ఉంటుందా అనే చర్చ కూడా లేకపోలేదు. ఏపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీలకు అన్ని సామాజిక వర్గాల అండ లభించడం కూడా కలిసి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఒక సామాజిక వర్గానికే ప్రాతినిథ్యం వహించేలా ఉండకుండా ఉండేందకు గాను బీసీ, దళితులను కూడా కలుపుకు పోవాలని కాపు సామాజిక వర్గం నేతలు భావిస్తున్నారని సమాచారం.