ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం.. టీడీపీ నేతపై చీటింగ్ కేసు.!

Published : Jul 17, 2021, 10:53 AM IST
ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం.. టీడీపీ నేతపై చీటింగ్ కేసు.!

సారాంశం

తెలంగాణ ప్రభుత్వంలో వీరికి మంచి పలుకుబడి ఉందని, ఉద్యోగాలు ఇప్పిస్తారని కోడి నాగరాజు యాదవ్‌ బనగానపల్లెకు చెందిన షేక్‌ అర్షద్‌ బాషా సోదరులను పరిచయం చేయించారు.

అమాయక ప్రజలను మోసం చేసి.. డబ్బులు కాజేశారంటూ టీడీపీ నేతపై చీటింగ్ కేసు నమోదైంది. బనగానపల్లె మార్కెట్ యార్డు మాజీ ఛైర్మన్, టీడీపీ నాయకుడు కోడి నాగరాజు  యాదవ్ పై బనగానపల్లె పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళితే... బనగానపల్లె మండలం బత్తులూరుపాడుకు చెందిన పసుపుల మధుసూదన్‌రెడ్డి, సోముల ప్రసాద్‌రెడ్డి బావ, బావమరుదులు. వీరు హైదరాబాద్‌లో ఉంటారు. తెలంగాణ ప్రభుత్వంలో వీరికి మంచి పలుకుబడి ఉందని, ఉద్యోగాలు ఇప్పిస్తారని కోడి నాగరాజు యాదవ్‌ బనగానపల్లెకు చెందిన షేక్‌ అర్షద్‌ బాషా సోదరులను పరిచయం చేయించారు. షేక్‌ అర్షద్‌బాషా హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన తమ్ముడు అబిద్‌బాషా కూడా హైదరాబాద్‌లో హోంగార్డుగా పనిచేస్తున్నాడు.

కోడి నాగరాజు యాదవ్‌ చెప్పిన మాటలు నమ్మి పసుపుల మధుసూదన్‌రెడ్డి ఖాతాలో రూ. 10.60 లక్షలు, సోముల ప్రసాద్‌రెడ్డి ఖాతాల్లో రూ.లక్ష జమ చేశారు. కాగా ఇప్పటివరకు ఉద్యోగం ఇప్పించకపోగా తీసుకున్న డబ్బులు కూడా తిరిగి ఇవ్వక పోవడంతో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి నాగరాజుపై చీటింగ్ కేసు నమోదు చేశారు.
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?