ఏపీ గిడ్డంగుల సంస్థ చైర్మన్ కరీముల్లా‌పై కేసు నమోదు..

By Sumanth KanukulaFirst Published Aug 9, 2022, 3:43 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ కరీముల్లా షేక్ అమీన్‌‌పై పోలీసు కేసు నమోదైంది. ఉద్యోగం ఇప్పిస్తానని కరీముల్లా మోసం చేశాడని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కరీముల్లాపై చీటింగ్ కేసు నమోదు చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ కరీముల్లా షేక్ అమీన్‌‌పై పోలీసు కేసు నమోదైంది. ఉద్యోగం ఇప్పిస్తానని కరీముల్లా మోసం చేశాడని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కరీముల్లాపై చీటింగ్ కేసు నమోదు చేశారు. వివరాలు.. శ్రీసత్యసాయి జిల్లా నల్లచెరువుకు చెందిన అబ్దుల్ హుస్సేన్ ఖాన్.. కరీముల్లాపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని మోసం చేశాడని ఆరోపించాడు. గిడ్డంగుల సంస్థలో అటెండర్ ఉద్యోగమిప్పిస్తానంటూ అబ్బుల్ హుస్సేన్ నుంచి కరీముల్లా రూ.3.80 లక్షలు వసూలు చేశాడని తెలిపాడు. గతేడాది డిసెంబర్ 31న ఈ డబ్బులు ఇచ్చినట్టుగా చెప్పాడు. 

ఆ తర్వాత ఉద్యోగం ఇస్తానని తన చుట్టూ తిప్పుకున్న కరీముల్లా.. ఆరు నెలలు గడిచిన ఉద్యోగం చూపించలేదని చెప్పాడు. తన గట్టిగా అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించాడు. ఈ క్రమంలోనే బాధితుడు అబ్దుల్ హుస్సేన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
 

click me!