గురజాడ అవార్డు తీసుకొనేందుకు అంగీకరించిన చాగంటి

By narsimha lode  |  First Published Nov 30, 2022, 3:37 PM IST


గురజాడ పురస్కారం అందుకొనేందుకు  ప్రముఖ ప్రవచనకర్త చాగంటి  కోటేశ్వరరావు అంగీకరించారు.ఈ  అవార్డు అందుకొనేందకు ఆయన ఇవాళ  సాయంత్రం విజయనగరానికి  చేరుకొంటారు. 


విజయనగరం: గురజాడ పురస్కారం తీసుకోవడానికి  ప్రముఖ  ప్రవచనకర్త  చాగంటి  కోటేశ్వరరావు అంగీకరించారు.చాగంటి కోటేశ్వరరావుకు  ఈ  ఏడాది  గురజాడ పురస్కారం ఇవ్వాలని గురజాడ  సాంస్కృతిక  సమాఖ్య  నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని కొందరు  వ్యతిరేకించారు.గురజాడ భావజాలానికి  వ్యతిరేకమైన భావజాలం ఉన్న చాగంటి కోటేశ్వరరావుకి ఈ  అవార్డును ఇవ్వడంపై  కవులు, రచయితలు, కళాకారులు  అభ్యంతరం  వ్యక్తం చేశారు. ఈ  నెల  27న కవులు, కళాకారులు, రచయితలు విజయనగరంలో  ర్యాలీ నిర్వహించారు. గురజాడ నివాసం  నుండి ర్యాలి నిర్వహించి  తమ నిరసనను వ్యక్తం  చేశారు.  ఆద్యాత్మిక  ప్రవచనాలు  చెప్పే చాగంటి కోటేశ్వరావుకి అభ్యుదయ భావజాలం  ఉన్న గురజాడ పురస్కారం  ఇవ్వడంపై అభ్యంతరం  వ్యక్తం  చేశారు. అయితే ఈ విషయమై వివాదం చేయవద్దని  సాంస్కృతిక సమాఖ్య కోరింది. 

also read:చాగంటి కోటేశ్వరరావుకి గురజాడ పురస్కారం: విజయనగరంలో కవులు, కళాకారుల నిరసన ర్యాలీ

Latest Videos

గురజాడ పురస్కారాన్ని  చాగంటి కోటేశ్వరరావుకు ఇవ్వడాన్ని  కొందరు వ్యతిరేకిస్తుంటే  మరికొందరు  సమర్ధిస్తున్నారు. దీంతో  ఈ అవార్డును స్వీకరించే విషయమై  నాలుగైదు రోజులుగా చాగంటి కోటేశ్వరరావు స్పందించలేదు. కానీ  ఈ అవార్డును తీసుకొనేందుకు చాగంటి కోటేశ్వరరావు అంగీకరించారు. ఈ  అవార్డు స్వీకరించేందుకు చాగంటి కోటేశ్వరరావు విజయనగరానికి  వెళ్లనున్నారు.

click me!