పవన్ కల్యాణ్ మాటలకు రాజద్రోహం కింద కేసు పెట్టాలి.. డిప్యూటీ సీఎం రాజన్నదొర

Published : Nov 30, 2022, 02:59 PM IST
పవన్ కల్యాణ్ మాటలకు రాజద్రోహం కింద కేసు పెట్టాలి.. డిప్యూటీ సీఎం రాజన్నదొర

సారాంశం

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం రాజన్నదొర సంచలన కామెంట్స్ చేశారు. పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని కూలగొడతానని అనడం రాజ్యాంగ వ్యతిరేకమని, చట్ట వ్యతిరేకమని అన్నారు. 

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం రాజన్నదొర సంచలన కామెంట్స్ చేశారు. పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని కూలగొడతానని అనడం రాజ్యాంగ వ్యతిరేకమని, చట్ట వ్యతిరేకమని అన్నారు. రాజ్యాంగపరమైన ప్రభుత్వాన్ని కూలగొడతానని అనడం రాజద్రోహం కిందకు వస్తుందని అన్నారు. సుప్రీం కోర్టులో దానిపై కేసు నడుస్తుంది కాబట్టి ఆగింది గానీ.. లేకపోతే రాజద్రోహం కింద కేసు పెట్టాల్సిన విషయమని చెప్పారు. అయితే ఎన్నికై వస్తానని అనడంలో తప్పు ఏం లేదని అన్నారు. ప్రజల తరపున పోరాడతానని అనడంలో ఎలాంటి తప్పు ఉండదన్నారు. 

పవన్ ఆయనది విప్లవ పార్టీ అంటున్నారని.. విప్లవం అనే చట్టానికి వ్యతిరేకం అని అన్నారు. పవన్ కల్యాన్ చెప్పే మాటలు చట్ట వ్యతిరేకంగా ఉన్నాయని అని చెప్పారు. ప్రజలను రెచ్చగొడుతున్న పవన్‌పై పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందన్నారు. వ్యక్తిగతం పవన్ కల్యాణ్‌పై, జనసేన తనకు గానీ, ప్రభుత్వానికి గానీ కక్ష సాధించాలని ఉండదని అన్నారు. వ్యక్తిగతంగా తాను ఎన్టీఆర్, చిరంజీవి, పవన్ కల్యాణ్ అభిమానినని చెప్పారు. పవన్ కల్యాణ్‌ను ఎన్నికల్లో పోటీ చేయమని.. ముఖ్యమంత్రి అభ్యర్థినని చెప్పుకోమనే చెబుతున్నామని అన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్