ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు జిల్లా జైలులో ఉన్న రైతులను పరామర్శించేందుకు సోమవారం నాడు జైలుకు వెళ్లనున్నారు.
అమరావతి: అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేసిన రైతులను పోలీసులు అరెస్ట్ చేయడంపై టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా జైలులో ఉన్న రైతును సోమవారం నాడు చంద్రబాబునాయుడు పరామర్శించనున్నారు.
రాజధానిని మార్చొద్దని ఆందోళన చేసిన రైతులపై కేసులు పెట్టడాన్ని చంద్రబాబునాయుడు తప్పుబట్టారు. రైతులపై కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. జిల్లా జైలులో ఉన్న రైతులను చంద్రబాబునాయుడు పరామర్శించనున్నారు.
రాజధానిని అమరావతి నుండి మార్చకూడదని డిమాండ్ చేస్తూ 12 రోజులుగా అమరావతి పరిసర ప్రాంతాల రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఆందోళనకారులపై పోలీసులు కేసులు పెట్టారు. ఈ కేసుల్లో భాగంగానే పోలీసులు అమరావతిలో ఆందోళన చేస్తున్న రైతులపై కేసులు పెట్టారు.