అత్తతో వివాహేతర సంబంధం.. చివరకు అల్లుడు ఆత్మహత్య

By telugu team  |  First Published Dec 30, 2019, 8:37 AM IST

మృతుడు తన అత్తతో వివాహేతర సంబంధం పెట్టుకుని ఆమే జీవితంగా ప్రవర్తించినట్లు పేర్కొన్నాడు. ముందుగా తన తల్లిదండ్రులు చూసిన అమ్మాయితో రవి శంకర్ తో వివాహం కాగా మారుతి దేవి.. బలవంతంగా విడాకులు ఇప్పించి ఆమె కుమార్తెతో తనకు మళ్లీ వివాహం చేసినట్లు పేర్కొన్నాడు.
 


పిల్లనిచ్చిన అత్త వేధింపులు తాళలేక ఓ అల్లుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. తన  చావుకి అత్తే కారణం అంటూ పెద్ద లేఖ రాసి మరీ ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం. ఈ సంఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... నిక రైల్వే స్టేషనులో త్రిపురాంతకం మండలం కొత్త ముడివేముల గ్రామానికి చెందిన అరిపిరాల రవిశంకర శర్మ (40)  శనివారం రాత్రిరైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని వద్ద పోలీసులకు మరణవాగ్మూల లేఖ లభించింది. దానిలో.. తన ఆత్మహత్యకు తన అత్త గుళ్ళపల్లి మారుతి దేవి కారణం అని రాసి ఉంది.  

Latest Videos

మృతుడు తన అత్తతో వివాహేతర సంబంధం పెట్టుకుని ఆమే జీవితంగా ప్రవర్తించినట్లు పేర్కొన్నాడు. ముందుగా తన తల్లిదండ్రులు చూసిన అమ్మాయితో రవి శంకర్ తో వివాహం కాగా మారుతి దేవి.. బలవంతంగా విడాకులు ఇప్పించి ఆమె కుమార్తెతో తనకు మళ్లీ వివాహం చేసినట్లు పేర్కొన్నాడు.

వారికి ముగ్గురు సంతానం కలిగిన అనంతరం తన అత్త తనను వదిలి సముద్రాల రామాచారి అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుని హైదరాబాదుకు మకాం మార్చిందని చెప్పాడు. తాను మృతిచెందినట్లు తప్పుడు మరణ ధ్రువీకరణ పత్రం పొంది ఎల్‌ఐసీ నుంచి డబ్బు పొందేలా ప్రేరేపించినట్లు పేర్కొన్నాడు.

 ఆ విషయం బయటకు పొక్కడంతో పోలీసులు కేసు నమోదు చేసి తనను జైలుకు పంపారన్నారు. బెయిల్‌పొంది బయటకు వచ్చిన తర్వాత భార్య నుంచి నన్ను విడదీసి మానసిక క్షోభకు గురిచేసినట్లు పేర్కొన్నాడు. ఇవన్నీ తట్టుకోలేక తనస్నేహితులకు సూసైడ్‌నోట్‌ వాట్సాప్‌ ద్వారా పంపినట్లు ఆ లేఖలో పేర్కొన్నాడు. ఆ లేఖ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు. 

click me!