నాది మోసమైతే, వైఎస్ రాజశేఖర్ రెడ్డిది దగా: కాపు రిజర్వేషన్లపై బాబు

By narsimha lodeFirst Published Jul 16, 2019, 5:36 PM IST
Highlights


కాపులకు రిజర్వేషన్లపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య మంగళవారం నాడు తీవ్ర వాగ్వాదం జరిగింది.  వైఎస్ఆర్‌ కూడ కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయలేదని  చంద్రబాబు గుర్తు చేశారు.
 


అమరావతి: కాపులకు రిజర్వేషన్లపై తాను చేసింది మోసమైతే, ఆనాడు  వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసింది దగా అని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు విమర్శించారు. 

కాపు రిజర్వేషన్‌పై మంగళవారం నాడు ఏపీ అసెంబ్లీలో జరిగిన చర్చలో టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్ మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది.

కాపు రిజర్వేషనపై మీ వైఖరి ఏమిటో చెప్పాలని  చంద్రబాబునాయుడు ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను ప్రశ్నించారు. కాపులకు 5 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తామని   తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.  

బీసీలకు అన్యాయం జరగకుండా  కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని  హామీ ఇచ్చినట్టుగా తాము వ్యవహరించినట్టుగా ఆయన ప్రస్తావించారు. కాపులకు రిజర్వేషన్ల విషయంలో  ఏం చేస్తారని ఆయన ప్రశ్నించారు.  

2014 ఎన్నికలకు ముందు పాదయాత్ర సందర్భంగా కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. ఈ హామీని అమలు చేయాలని  చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత  ఈ రిజర్వేషన్లను అమలు చేయాలని  కాపులు ఆందోళన నిర్వహించిన విషయం తెలిసిందే.

 

సంబంధిత వార్తలు

సినిమాలో విలన్: బాబుపై వైఎస్ జగన్ నిప్పులు

click me!