కుప్పంలో వైసీపీ గెలవలేదు.. ప్రజాస్వామ్యం ఓడిందని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు విమర్శించారు.
గుంటూరు:కుప్పంలో వైసీపీ గెలవలేదు.. ప్రజాస్వామ్యం ఓడిందని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు విమర్శించారు. గురువారంనాడు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాదరణ ఉన్నవాళ్లే ఎన్నికల్లో గెలుస్తారన్నారు. కానీ, ఏపీలో ఇప్పుడు జరుగుతున్నది ఏమిటని ఆయన ప్రశ్నించారు.
also read:కుప్పంలో చంద్రబాబు క్లీన్ బౌల్డ్: పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
పోలీసులకు పోలింగ్ బూత్‌లలో ఏం పని అని ఆయన ప్రశ్నించారు. వాలంటీర్లు కూడా రౌడీలుగా బెదిరింపులకు దిగుతున్నారని ఆయన ఆరోపించారు. ఏకగ్రీవాలను ఒప్పుకోవాలని ఒత్తిడి తెస్తున్నారని ఆయన మండిపడ్డారు.
పోలీసులకు పోలింగ్ బూత్‌లలో ఏం పని అని ఆయన ప్రశ్నించారు. పక్కా ప్లాన్ ప్రకారంగా రాత్రివేళ అక్రమాలకు పాల్పడ్డారని చంద్రబాబునాయుడు ఆరోపించారు. వైసీపీ అక్రమాలకు పాల్పడిందన్నారు. పోలింగ్ బూత్ లలో వీడియోగ్రఫీ కూడ సరిగా చేయలేదన్నారు.
వైసీపీ అక్రమాలపై సాక్ష్యాలతో పట్టిస్తే ఏం చర్యలు తీసుకొన్నారని ఆయన ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు.ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోకపోతే బానిసలుగా జీవించాల్సి వస్తోందన్నారు. 'స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అక్రమాలకు పాల్పడిందని టీడీపీ పలు విషయాలపై ఫిర్యాదులు చేసింది.టీడీపీతో పాటు ఇతర విపక్షాలకు చెందిన నేతలు కూడ ఎస్ఈసీకి ఫిర్యాదులు చేశాయి.