ఒక్కడు వెంకయ్య ఉంటే తప్పించారు: చంద్రబాబు

By narsimha lodeFirst Published Feb 1, 2019, 4:11 PM IST
Highlights

ప్రత్యేక హోదాపై తాను మాట మార్చలేదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. కేంద్రమే తప్పుడు సమాచారమిచ్చి ఏపీకి అన్యాయం చేసిందని  ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమరావతి: ప్రత్యేక హోదాపై తాను మాట మార్చలేదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. కేంద్రమే తప్పుడు సమాచారమిచ్చి ఏపీకి అన్యాయం చేసిందని  ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.దక్షిణ భారతంలో ఉన్న బీజేపీ ఒక్క లీడర్ వెంకయ్యనాయుడిని  కేబినెట్ నుండి తప్పించారని చంద్రబాబు బాబు చెప్పారు.

శుక్రవారం నాడు ఏపీ అసెంబ్లీలో కేంద్రం రాష్ట్రానికి చేసిన అన్యాయంపై మాట్లాడారు.14వ ఆర్థిక సంఘం పేరుతో మోసం చేశారని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదాపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని 14వ ఆర్థిక సంఘం ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం మాత్రం ప్యాకేజీ పేరు చెప్పిందన్నారు.చ 

డబ్బులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరితే అప్పు ఇస్తామంటున్నారని ఆయన చెప్పారు.  అప్పు ఇస్తే తాను సంపాదించుకోలేనా అని బాబు మండిపడ్డారు. మీరు ఇచ్చింది ఏమిటీ, పన్నులు కట్టడం లేదా అని ఆయన ప్రశ్నించారు. కేంద్రానికి తాము కూడ పన్నులు కడుతున్నామని ఆయన చెప్పారు. ఏపీ రాష్ట్రం దేశంలో భాగం కాదా అని ఆయన ప్రశ్నించారు.

తమిళనాడు, ఈశాన్య రాష్ట్రాల్లో ఎందుకు వ్యతిరేకత వస్తోందో ఆలోచించుకోవాలని చంద్రబాబునాయుడు బీజేపీ నేతలకు సూచించారు. కేంద్రానికి, బీజేపీ నేతలకు వ్యతిరేకంగా మాట్లాడితే ఫినిష్ చేయాలని చూస్తున్నారని బాబు చెప్పారు.  నాలుగున్నర ఏళ్ల చిన్న పసిపిల్ల లాంటి  రాష్ట్రాన్ని ఆదుకొంటారని భావించినట్టు చెప్పారు.  హోదా ఇవ్వకపోయినా ఏ పేరుతోనైనా రాష్ట్రాన్ని ఆదుకొంటారని అనుకొంటే  మట్టి,నీల్లు ముఖాన కొట్టి వెళ్లారని బాబు కేంద్రంపై మండిపడ్డారు.

నాలుగేళ్లలో కేంద్రం వ్యవహరించిన తీరుపై బాబు మండిపడ్డారు. తమ రక్తం ఉప్పొంగుతోందన్నారు. ఊడిగం చేసే వాళ్లమా అంటూ బీజేపీపై ఆయన మండిపడ్డారు. దక్షిణ భారతంలో బీజేపీకి ఒక్క లీడర్ ఉన్నాడా అని ఆయన ప్రశ్నించారు. దక్షిణ భారతంలో ఉన్న బీజేపీ ఒక్క లీడర్ వెంకయ్యనాయుడిని  కేబినెట్ నుండి తప్పించారన్నారు. అన్ని రాష్ట్రాలు తిరిగే  వెంకయ్యను ప్రభుత్వం నుండి పక్కను నెట్టడం ద్వారా దక్షిణాది నేతలకు బీజేపీ ఏ మాత్రం గౌరవం ఇస్తోందో చెప్పాలని  బాబు ప్రశ్నించారు.

click me!