నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా : చంద్రబాబు

By Nagaraju penumalaFirst Published Feb 1, 2019, 3:51 PM IST
Highlights

దేశంలో ఏ జాతీయ ప్రాజెక్ట్ పనులైనా పోలవరం అంత వేగంగా జరుగుతున్నాయా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇప్పటి వరకు 65 శాతం పనులు పూర్తిచేకసినట్లు తెలిపారు. మే నెలాఖరుకు ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చంద్రబాబు చెప్పుకొచ్చారు.

అమరావతి: ఏపీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావోద్వేగానికి లోనయ్యారు. పోలవరం జాతీయ ప్రాజెక్టుపై అసెంబ్లీలో చంద్రబాబు ప్రసంగించారు. పోలవరానికి జాతీయ స్థాయిలో కేంద్రప్రభుత్వం అవార్డు ప్రదానం చేసిందని చెప్పుకొచ్చారు. 

దేశంలో ఏ జాతీయ ప్రాజెక్ట్ పనులైనా పోలవరం అంత వేగంగా జరుగుతున్నాయా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇప్పటి వరకు 65 శాతం పనులు పూర్తిచేకసినట్లు తెలిపారు. మే నెలాఖరుకు ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చంద్రబాబు చెప్పుకొచ్చారు.

 దేశంలో ఏ ప్రాజెక్ట్ పనులైనా పోలవరం ప్రాజెక్టులా వేగవంతంగా జరిగుతున్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పుకొచ్చారు. పోలవరం ప్రాజెక్ట్ వస్తే ఏపీ బాగుపడుతుందని తాను భావిస్తున్నట్లు తెలిపారు. తమిళనాడుకి నీళ్లు ఇస్తే తప్పా అంటూ నిలదీశారు. 

నదుల అనుసంధానం చేస్తామని తిరుపతిలో మోదీ చెప్పారని కానీ దాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. పట్టిసీమ ద్వారా గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని చెప్పుకొచ్చారు. పోలవరం, పట్టిసీమలపై వైసీపీ కోర్టులకు వెళుతూ ప్రాజెక్టులను అడ్డుకుంటుందని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. 

click me!