శ్రీకాకుళంలో స్వాతంత్య్రదినోత్సవ వేడుకల్లో పాల్గొన్న బాబు

Published : Aug 15, 2018, 09:13 AM ISTUpdated : Sep 09, 2018, 10:55 AM IST
శ్రీకాకుళంలో స్వాతంత్య్రదినోత్సవ వేడుకల్లో పాల్గొన్న బాబు

సారాంశం

శ్రీకాకుళంలో స్వాతంత్య్రదినోత్సవ వేడుకల్లో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు బుధవారం నాడు పాల్గొన్నారు.

శ్రీకాకుళం: శ్రీకాకుళంలో స్వాతంత్య్రదినోత్సవ వేడుకల్లో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు బుధవారం నాడు పాల్గొన్నారు. స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలను రాష్ట్రంలోని ప్రతి చోటా నిర్వహించాలనే ఉద్దేశ్యంతో ప్రతి ఏటా రాష్ట్రంలోని ఏదో ఒక జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ఏపీ సర్కార్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే ఇవాళ ఏపీ సర్కార్ స్వాతంత్య్రదినోత్సవ వేడుకలను శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో నిర్వహించారు. 

స్వాతంత్య్రదినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఏపీలోని శ్రీకాకుళంలో జాతీయ పతాకాన్ని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆవిష్కరించారు.ఆ తర్వాత పోలీసుల గౌరవ వందనాన్ని చంద్రబాబునాయుడు స్వీకరించారు.

మరోవైపు ఏపీలోని పలు పార్టీల రాష్ట్ర కార్యాలయాల్లో  స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను బుధవారం నాడు ఘనంగా నిర్వహించారు.విజయవాడలోని వైసీపీ కార్యాలయంలో స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మహాత్ముని స్పూర్తితో వైసీపీ ముందుకు వెళ్తోందని వైసీపీ నేతలు గుర్తు చేశారు.

మరోవైపు హైద్రాబాద్‌లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో  నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఏపీ శాసనమండలి సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సహ పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు. 


 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే