బీసీలకు వరాలు: వైసీపీ,బీజేపీ ట్రాప్‌లో పడొద్దన్న బాబు

By narsimha lodeFirst Published Jan 27, 2019, 7:01 PM IST
Highlights

బీసీలకు చంద్రబాబునాయుడు వరాల జల్లు కురిపించారు. తమది బీసీల ప్రభుత్వమని చెప్పారు.బీసీలు వైసీపీ, బీజేపీల ట్రాప్‌లో పడొద్దని చంద్రబాబునాయుడు సూచించారు
 

రాజమండ్రి:బీసీలకు చంద్రబాబునాయుడు వరాల జల్లు కురిపించారు. తమది బీసీల ప్రభుత్వమని చెప్పారు.బీసీలు వైసీపీ, బీజేపీల ట్రాప్‌లో పడొద్దని చంద్రబాబునాయుడు సూచించారు.

రాజమండ్రిలో టీడీపీ ఆధ్వర్యంలో ఆదివారం నాడు జయహో బీసీ సదస్సు నిర్వహించారు.బీసీలకు న్యాయం చేసిన పార్టీ టీడీపీయేనని ఆయన గుర్తు చేశారు. బీసీ నేతలను ఢిల్లీకి పంపిన ఘనత టీడీపీదేనని ఆయన చెప్పారు.

యాదవుల కోసం ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.శెట్టిబలిజ, ఈడిగ, శ్రీశయన, యాత, గౌడ,యాదవ,తూర్పుకాపు, కొప్పుల వెలమల కోసం ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు.

ఇక నుండి ప్రతి చేనేత కార్మికులకు 150 యూనిట్ల విద్యుత్‌ను ఇవ్వనున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు.హెయిర్ సెలూన్లలో 150 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ను ఇస్తామని బాబు హామీ ఇచ్చారు.వాల్మీకి బోయలను ఎస్టీల్లో చేరుస్తామని బాబు తెలిపారు.

జడ్జీల నియామకాల్లో కూడ బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని సిఫారసు చేసినట్టు బాబు గుర్తు చేశారు. అమరావతిలో బీసీల కోసం బీసీ భవన్ ను రూ.100 కోట్లతో నిర్మించనున్నట్టు బాబు హమీ ఇచ్చారు. 

తెలంగాణ, ఏపీ రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు కూడ బీసీ నేతలేనని చంద్రబాబునాయుడు చెప్పారు.అన్ని వ్యవస్థల్లోనూ కూడ బీసీలకు టీడీపీ గుర్తింపు ఇచ్చిందన్నారు.
టీడీపీతోనే బీసీలకు గుర్తింపు లభించిందని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.కాంగ్రెస్ పార్టీ హయాంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రులు ఇంత సంఖ్యలో ఉన్నారా అని బాబు ప్రశ్నించారు.

బీసీలను  వైఎస్ రాజశేఖర్ రెడ్డి అణగదొక్కారని చంద్రబాబునాయుడు చెప్పారు.బీసీ ఫైనాన్స్ కార్పోరేషన్‌కు రూ.1.143 కోట్లను ఇచ్చినట్టు ఆయన తెలిపారు. బీసీలకు న్యాయం చేసేది టీడీపీ ఒక్కటేనని బాబు చెప్పారు.

ఉద్యోగాల్లో బీసీలకు 27 శాతం రిజర్వేషన్లను, ఆధునిక పనిముట్లను అందించినట్టు చంద్రబాబునాయుడు గుర్తు చేశారు. టీటీడీ ఛైర్మెన్‌గా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని నియమిస్తే తప్పుడు ఆరోపణలు చేశారని చంద్రబాబునాయుడు చెప్పారు.

767 జీవోను రద్దు చేసి గీత కార్మికుల పొట్టను కొట్టిందని చంద్రబాబునాయుడు చెప్పారు. నేత కార్మికులకు రూ.111 కోట్లు రుణమాఫీ చేశామన్నారు చంద్రబాబునాయుడు.బీసీలంతా టీడీపీ వైపే ఉన్నారని, తమను ఏమీ చేయలేరని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. 

click me!