చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ఇద్దరు అల్లుళ్లకు టిక్కెట్లు దక్కేనా?

By narsimha lodeFirst Published Jan 27, 2019, 5:20 PM IST
Highlights

చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ఇద్దరు అల్లుళ్లు ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనేందుకు ఆసక్తిని చూపుతున్నారు. అయితే ఒకే కుటుంబానికి మూడు టిక్కెట్లు చంద్రబాబునాయుడు కేటాయిస్తారా అనే చర్చ సాగుతోంది.
 


తిరుపతి: చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ఇద్దరు అల్లుళ్లు ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనేందుకు ఆసక్తిని చూపుతున్నారు. అయితే ఒకే కుటుంబానికి మూడు టిక్కెట్లు చంద్రబాబునాయుడు కేటాయిస్తారా అనే చర్చ సాగుతోంది.

చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ఇద్దరు అల్లుళ్లు రానున్న ఎన్నికల్లో  పోటీ చేసేందుకు ఆసక్తిని చూపుతున్నారు.  చిత్తూరు ఎంపీ పెద్దల్లుడు వేణు సత్యవేడు అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

కడప జిల్లా రైల్వేకోడూరు అసెంబ్లీ స్థానం నుండి  చిత్తూరు ఎంపీ శివప్రసాద్  చిన్నల్లుడు  నరసింహ ప్రసాద్ ఆసక్తి చూపుతున్నారు. గతంలో సత్యవేడు అసెంబ్లీ స్థానం నుండి శివప్రసాద్ ప్రాతినిథ్యం వహించారు. సత్యవేడు నుండి శివప్రసాద్ ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలోనే  మంత్రిగా కూడ పనిచేశారు.

శివప్రసాద్ సత్యవేడు నుండి  ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో  వేణు శివప్రసాద కు సహాయంగా ఉండేవాడు.  వచ్చే ఎన్నికల్లో  టీడీపీ తరపున  సత్యవేడు అసెంబ్లీ స్థానం నుండి  పోటీ చేసేందుకు వేణు ఆసక్తిగా చూపుతున్నారు.ఈ రెండు స్థానాలతో పాటు చిత్తూరు ఎంపీ టిక్కెట్టు  కోరుకొంటున్నారు. అయితే ఈ కుటుంబానికి మూడు టిక్కెట్లు దక్కడం సాధ్యమా అనే చర్చ సాగుతోంది. 

click me!