టార్గెట్ 2019: తమ్ముళ్లకు చుక్కలే, బాబు ప్లాన్ ఇదే

By narsimha lodeFirst Published Jan 27, 2019, 4:35 PM IST
Highlights

కర్నూల్ జిల్లాలో  పార్టీని బలోపేతం చేసేందుకు టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుుడు ప్లాన్ చేస్తున్నారు. గత ఎన్నికల కంటే వచ్చే ఎన్నికల్లో  అత్యధిక స్థానాలను కైవసం చేసుకొనేందుకు ఆ పార్టీ ప్లాన్ చేస్తోంది.

కర్నూల్: కర్నూల్ జిల్లాలో  పార్టీని బలోపేతం చేసేందుకు టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుుడు ప్లాన్ చేస్తున్నారు. గత ఎన్నికల కంటే వచ్చే ఎన్నికల్లో  అత్యధిక స్థానాలను కైవసం చేసుకొనేందుకు ఆ పార్టీ ప్లాన్ చేస్తోంది.

ఏపీలో త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి మూడవ వారంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది.ఈ తరుణంలో  కర్నూల్‌లోని 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎవరిని అభ్యర్ధిగా బరిలోకి దింపితే  పార్టీకి ప్రయోజనమనే విషయమై టీడీపీ నాయకత్వం  సర్వే నిర్వహిస్తోంది.

ఐవీఆర్ఎస్ ద్వారా ఆయా నియోజకవర్గాల్లో  ఏ అభ్యర్ధి బలబలాలను చంద్రబాబునాయుడు సేకరిస్తున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ మూడు అసెంబ్లీ స్థానాల్లోనే విజయం సాధించింది.అయితే ఆ తర్వాత ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా ఐదుగురు వైసీపీలు టీడీపీలో చేరారు. 

అయితే  రానున్న ఎన్నికల్లో ఎక్కువ సీట్లను కైవసం  చేసుకొనేలా చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. బూత్‌స్థాయి నుండి పార్టీని బలోపేతం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, పార్టీ ఇంచార్జీల పనితీరుపై బాబు నివేదికలను తెప్పించుకొంటున్నారు.

ఆయా నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఇంచార్జీల బలబలాలు,  పనితీరుపై పలు మార్గాల ద్వారా చంద్రబాబునాయుడు నివేదికలను తెప్పించుకొంటున్నారు. ఈ నివేదిక ఆధారంగానే బాబు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వనున్నారు. తన వద్ద సమాచారం మేరకు ఎమ్మెల్యేలు, నేతలతో బాబు ముఖాముఖి సమావేశాల్లో తన అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు.

ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా వేలాది మంది నుండి చంద్రబాబునాయుడు సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఒక్కో విడతలో 25 వేల మంది నుండి సమాచారాన్ని సేకరిస్తున్నారు. రెండో విడతలో  55వేల మంది నుండి సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఈ సమాచారం ఆధారంగా  పార్టీ నేతలు లేదా ఎమ్మెల్యేలకు గ్రేడ్‌లను ఇవ్వనున్నారు. ఏ నుండి డి వరకు గ్రేడ్‌లుగా విభజిస్తున్నారు.

ఏ,బీ గ్రేడులు వచ్చిన వారికి  చంద్రబాబునాయుడు కొన్ని సలహాలు, సూచలను ఇచ్చి పంపుతున్నారు. మిగిలిన గ్రేడులు వచ్చిన వారిని తీవ్రంగా హెచ్చరించి పంపుతున్నారు. ఇప్పటికే జిల్లాకు చెందిన ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డిని బాబు పిలిచి మాట్లాడారు. రానున్న రోజుల్లో  మిగిలిన ఎమ్మెల్యేలు, పార్టీ ఇంచార్జీలతో బాబు ముఖాముఖి సమావేశం కానున్నారు.


 

click me!