త్వరలో స్థానిక ఎన్నికలు... జగన్ పైకి చంద్రబాబు బీసీ అస్త్రం?

By telugu news teamFirst Published Mar 9, 2020, 9:12 AM IST
Highlights

స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34శాతానికి పైగా స్థానాలు కేటాయించాలని నిర్ణయించారు. బీసీ సాధికారత అణచివేసేందుకు వైసీపీ ప్రభుత్వం రిజర్వేషన్లను 34శాతం నుంచి 24శాతానికి తగ్గించిందని చంద్రబాబు పేర్కొన్నారు. కొన్ని జిల్లాల్లో కనీసం 12శాతం కూడా అమలు కావడం లేదని మండిపడ్డారు.
 


త్వరలో ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని ఓ వైపు అధికార పార్టీ ప్రయత్నిస్తుంటే... కనీసం ఈ ఎన్నికల్లోనైనా తమ బలం పెంచుకొని నిలబడాలనికి ప్రతిపక్ష టీడీపీ చూస్తోంది. ఈ నేపథ్యంలో ఎవరికి తగినట్లు వారు వ్యూహాలు రచిస్తున్నారు.

అయితే... ఈ ఎన్నికల నేపథ్యంలో... బీసీలను టార్గెట్ చేసి సీఎం జగన్ కి.. చంద్రబాబు షాకిచ్చేలా కనిపిస్తున్నారు. బీసీల హక్కులు, రిజర్వేషన్ల అంశాన్ని హైలెట్ చేసి.. వారి నుంచి తమ మద్దతు పెంచుకోవాలని చంద్రబాబు ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన ఇటీవల నెల్లూరు పర్యటనలో చేసిన కామెంట్సే అందుకు ఊతమిస్తున్నాయి.

Also Read ఆయనేమైనా సూపర్ ఎన్నికల కమీషనరా..?: సీఎం జగన్ పై చంద్రబాబు ఫైర్..

ఈ నేపథ్యంలో చంద్రబాబు ఓ నిర్ణయం తీసుకున్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34శాతానికి పైగా స్థానాలు కేటాయించాలని నిర్ణయించారు. బీసీ సాధికారత అణచివేసేందుకు వైసీపీ ప్రభుత్వం రిజర్వేషన్లను 34శాతం నుంచి 24శాతానికి తగ్గించిందని చంద్రబాబు పేర్కొన్నారు. కొన్ని జిల్లాల్లో కనీసం 12శాతం కూడా అమలు కావడం లేదని మండిపడ్డారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు గణనీయంగా పడిపోతున్నాయని మండిపడ్డారు. నెల్లూరు జిల్లాలో బీసీ రిజర్వేషన్లు కేవలం 10.49శాతం మాత్రమే కేటాయించారన్నారు. బీసీలకు 34శాతం కంటే ఎక్కువ సీట్లు ఇస్టామని చెప్పి చట్టపరంగా ఇచ్చే రిజర్వేషన్లు ఎందుకు తొలగించారని ప్రశ్నించారు.

బీసీలు బంతిలాంటి వారంటూ వైఎస్సార్‌సీపీ ఎంత అణిచేయాలని చూస్తే అంత ఎత్తుకు ఎదుగుతారనే విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు చంద్రబాబు. టీడీపీ కల్పించిన రిజర్వేషన్ల వల్లే స్థానిక సంస్థల నుంచి రాష్ట్ర స్థాయికి బీసీ నాయకత్వం రాష్ట్రంలో ఎదిగిందని.. ఎర్రన్నాయుడు లాంటివారు జాతీయస్థాయిలో కూడా రాణించారని గుర్తు చేశారు. కానీ రిజర్వేషన్లలో సగానికి కోతపెట్టి బీసీల రాజకీయ పునాదులనే ధ్వంసం చేసేందుకు సీఎం జగన్ మహాకుట్ర పన్నారని ఆరోపించారు.

ఎవరెన్ని పన్నాగాలు చేసినా బీసీలను అణిచేయడం అసాధ్యమని.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో 34%పైగా స్థానాలను బీసిలకు కేటాయించనున్నట్లు చంద్రబాబు తెలిపారు. జగన్ కుట్రలను తిప్పికొట్టాల్సిన బాధ్యత బీసి,ఎస్సీ,ఎస్టీ ముస్లిం మైనారిటీ వర్గాలదేనని.. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని వైసీపీ అరాచకాలకు అడ్డుకట్ట వేయాలన్నారు.

click me!