దొరకగానే దొరబాబు, పరదేశి రోజాకే ఫస్ట్ కాల్: ఫైర్ బ్రాండ్ జబర్దస్త్ రియాక్షన్

Published : Mar 07, 2020, 06:22 PM IST
దొరకగానే దొరబాబు, పరదేశి రోజాకే ఫస్ట్ కాల్: ఫైర్ బ్రాండ్ జబర్దస్త్ రియాక్షన్

సారాంశం

జబర్దస్త్ జడ్జిగా పనిచేసి వైసీపీ ఎమ్మెల్యే రోజా పలుకుబడిని వాడుకుని బయటపడుదామని అనుకున్న దొరబాబు, పరదేశిలకు చుక్కెదురైనట్లు తెలుస్తోంది. వారి గురించి రోజా పోలీసులకు పక్కా సూచన చేసినట్లు సమాచారం.

విశాఖపట్నం: వ్యభిచార గృహంపై దాడిలో పట్టుబడిన జబర్దస్త్ షో నటులు దొరబాబు, పరదేశి చేసిందేమిటో తెలిస్తే ఆశ్చర్యం కలగకమానదు. వారిద్దరు జబర్దస్త్ జడ్జిగా వ్యవహరించిన వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు రోజాకు ఫోన్ చేయించారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

అది ఎంత వరకు నిజమో గానీ వార్త మాత్రం సోషల్ మీడియాలో గుప్పుమంటోంది. దానికి ఆమె ఇచ్చిన సమాధానం జబర్దస్త్ గానే ఉందని అంటన్నారు. మార్చి 4వ తేదీన విశాఖపట్నంలోని మాధవదారలోని ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతోందని పోలీసులకు సమాచారం అందింది. దాంతో టాస్క్ ఫోర్స్ డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు చేశారు. 

ఆ దాడుల్లో జబర్దస్త్ కామెడీ షో యాక్టర్లు దొరబాబు, పరదేశి పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఇద్దరు వ్యభిచార గృహం నిర్వాహకులతో పాటు వారు పట్టుబడ్డారు. వారిద్దరిని చూసి పోలీసులు అవాక్కయ్యారు. వీడియోలు తీయవద్దంటూ, తమను వదిలేయాలంటూ పరదేశి వేడుకున్నట్లు తెలుస్తోంది. 

రోజా చేత చెప్పిస్తే పోలీసులు వింటారేమోనని వారు ఓ ప్రయత్నం చేశారు. పోలీసుల చేత ఆమెకు కాల్ చేయించారు. ఇటువంటి విషయాల్లో తాను ఏ విధమైన సహాయం చేయబోనని, పలుకుబడిని వాడి ఇటువంటి వారికి సహాయం చేస్తే అది అలుసుగా తీసుకుంటారని రోజా అన్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

అంతేకాకుండా, ఒక మహిళగా తాను ఈ విధమైన పనులు చేసేవారిని తాను ప్రోత్సహించబోనని, మీ పద్ధతుల్లో మీరు దర్యాప్తు చేసుకోవాలని ఆమె పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది.  

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్