ఎన్డీఏను వదిలేది లేదు

First Published Feb 18, 2018, 9:43 AM IST
Highlights
  • మొత్తానికి చంద్రబాబునాయుడు ఓ విషయంలో క్లారిటీ ఇచ్చారు.

మొత్తానికి చంద్రబాబునాయుడు ఓ విషయంలో క్లారిటీ ఇచ్చారు. అదేమిటంటే, ఎన్డీఏలో నుండి బయటకు వచ్చే ఉద్దేశ్యం లేదట. గడచిన మూడున్నరేళ్ళుగా కేంద్రప్రభుత్వం ఏపికి అన్యాయం చేస్తూనే ఉంది. విభజన చట్టంలో పేర్కొన్న హామీలను కానీ రాష్ట్రప్రయోజనాల విషయంలో కానీ ఏపిని ఏమాత్రం ఖాతరు చేయటం లేదు. వ్యక్తిగత ఇబ్బందులు వల్ల చంద్రబాబు కూడా కేంద్రాన్ని ఏదశలో కూడా నిలదీయలేకపోతున్నారు.

ఇటువంటి నేపధ్యంలో ఈ మధ్యనే కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టింది. అందులో కూడా ఏపి ప్రయోజనాలపై ఒక్క ప్రస్తావన కూడా లేకపోవటంతో జనాలు మండిపోతున్నారు. జనాగ్రహాన్ని గమనించిన వైసిపి, టిడిపి ఎంపిలు కూడా పార్లమెంటులో నానా రచ్చ చెస్తున్నారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు మాత్రం బడ్జెట్ గురించి మీడియాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు.

 ఈ నేపధ్యంలో బెంగుళూరులో ఓ మీడియా సంస్ధ నిర్వహించిన ‘ది హడిల్’ సదస్సులో చంద్రబాబు పాల్గొన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన కాంగ్రెస్ కు ప్రజలు గుణపాఠం చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ఆ విషయాన్ని కేంద్రం గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ఏపి ప్రజలకు భావోద్వేగాలు అధికమట. నవ్యాంధ్రప్రజలు గాయపడిన సైనికుల్లా ఉన్నారట. తగిన న్యాయం జరగకపోతే గాయాలు మరింత బాధిస్తాయన్నారు. అదే సమయంలో తాను ఎన్డీఏలో నుండి వైదొలిగేది లేదంటూ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పటం గమనార్హం.

click me!