
ఏపీలో శుక్రవారం ఉదయం ఐటీ దాడులు కలకలం రేపాయి. పలువురు టీడీపీ నేతల ఇళ్లల్లో దాడులు చేస్తున్నారు. మంత్రి నారాయణ కు చెందిన విద్యా సంస్థల్లో కూడా దాడులు జరిపినట్లు ప్రచారం జరిగింది. కాగా.. ఈ దాడులపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు.
ఎన్నికల జరగబోయే రాష్ట్రాల్లో ఐటీ, ఈడీ దాడులు చేయటం బీజేపీకి అలవాటైపోయిందని వ్యాఖ్యానించారు. పార్టీ నేతలందరూ అప్రమత్తంగా ఉండాల్సిందిగా సూచించారు. ఎటువంటి పరిణామాలైనా ఎదుర్కొంటామని, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటమే లక్ష్యంగా పనిచేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
read more news
బెజవాడలో ఐటీ దాడుల కలకలం.. టీడీపీ నేతల ఇళ్లపై దాడులకు పక్కా వ్యూహం..?
టీడీపీ నేతలపై ఐటీ గురి.. నెల్లూరులో బీద మస్తాన్ రావు ఇంటిలో సోదాలు
బెజవాడలో ఐటీ దాడులు.. నారాయణ కాలేజీ దాకా వెళ్లి మధ్యలో వచ్చేసిన అధికారులు
ఐటీ దాడులపై మంత్రి నారాయణ స్పందన