కాపు కోటాను మళ్లీ తెరపైకి తెచ్చిన చంద్రబాబు: ఈబీసి రిజర్వేషన్ల బిల్లుపై వ్యాఖ్య

By Nagaraju TFirst Published Jan 8, 2019, 6:38 PM IST
Highlights

కేంద్రంలో ఈబీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చ జరుగుతుండటంతో ఏపీలో కాపు రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తెచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. కాపులకు రిజర్వేషన్లు ఇస్తేనే తాము ఈబీసీ రిజర్వేషన్లను సమర్ధిస్తామని స్పష్టం చేశారు. 

కర్నూలు: కేంద్రంలో ఈబీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చ జరుగుతుండటంతో ఏపీలో కాపు రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తెచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. కాపులకు రిజర్వేషన్లు ఇస్తేనే తాము ఈబీసీ రిజర్వేషన్లను సమర్ధిస్తామని స్పష్టం చేశారు. 

కర్నూలులో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన చంద్రబాబు ఎన్నికల్లో లబ్ది పొందేందుకు ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్లని మోదీ చెప్తున్నారని ఆరోపించారు. కాపులకు రిజర్వేషన్లు ఇస్తేనే ఈబీసీలకు రిజర్వేషన్లను సమర్థిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. 

అలాగే వాల్మీకులను ఎస్టీల్లో చేర్చాలని తాము కేంద్రానికి నివేదిక పంపామని అయితే కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఆయన చెప్పారు. వాల్మీకుల సంక్షేమానికి రూ.100 కోట్లు కేటాయిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.

మరోవైపు ఈబీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తే కాపులకు తక్షణం 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్‌ డిమాండ్ చేశారు. కాపులు కొత్తగా రిజర్వేషన్లు కోరడం లేదన్నారు. గతంలో ఉన్న రిజర్వేషన్లనే పునరుద్ధరించాలని కోరుతున్నారని ఎంపీ  స్పష్టం చేశారు. 

click me!