ఏపీకి ప్రత్యేక హోదా, విభజన సమస్యలు: ఢిల్లీలో బాబు ధర్నా

By narsimha lodeFirst Published Jan 26, 2019, 4:49 PM IST
Highlights

ఏపీ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఢిల్లీ కేంద్రంగా ఒక్క రోజు దీక్ష చేయాలని  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకొన్నారు. పార్లమెంట్ సమావేశాల ముగింపు రోజున చంద్రబాబు దీక్ష చేయనున్నారు

అమరావతి: ఏపీ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఢిల్లీ కేంద్రంగా ఒక్క రోజు దీక్ష చేయాలని  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకొన్నారు. పార్లమెంట్ సమావేశాల ముగింపు రోజున చంద్రబాబు దీక్ష చేయనున్నారు.

2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమిగా పోటీ చేశాయి. ఏపీకి ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన హామీలను అమలు చేయడంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ వైఫల్యం చెందిందని టీడీపీ ఆరోపిస్తోంది. ఏపీకి న్యాయం చేయలేదని ఆరోపిస్తూ ఎన్డీఏ నుండి కూడ గత ఏడాది టీడీపీ వైదొలిగిన విషయం తెలిసిందే.

కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఈ ఏడాది మార్చి లేదా ఏప్రిల్ మాసంలో పార్లమెంట్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ తరుణంలో కేంద్రం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.

అయితే ఇప్పటికే కేంద్రం నుండి రాష్ట్రానికి దక్కాల్సిన నిధులు కూడ రాలేదని టీడీపీ సర్కార్ ఆరోపణలు చేస్తోంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో కూడ ఏపీకి న్యాయం జరిగే అవకాశం ఉండకపోవచ్చనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు

శనివారం నాడు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలతో చంద్రబాబునాయుడు చర్చించారు. బడ్జెట్ లో ఏపీకి సరైన నిధులు అందకపోతే దీక్ష చేయాలా లేదా అనే అంశంపై ఎంపీలతో బాబు చర్చించారు.

పార్లమెంట్ సమావేశాల చివరి రోజున కేంద్రం తీరును నిరసిస్తూ ఒక్క రోజు దీక్ష చేయాలనే అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం.  పార్లమెంట్ సమావేశాల చివరి రోజున కేంద్రం తీరును నిరసిస్తూ బాబు దీక్ష చేసే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ దీక్షలో పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు.

asianet news special

లక్ష నుంచి 25 కోట్లు.. తెలుగు ఓల్డ్ మూవీస్ కలెక్షన్స్ (1933-2002)

బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ రాసిన బాక్స్ ఆఫీస్ కథలు!

click me!