పార్టీలో సమూల మార్పులకు చంద్రబాబు శ్రీకారం

By narsimha lodeFirst Published Aug 13, 2019, 1:39 PM IST
Highlights

పార్టీలో మార్పులకు చంద్రబాబునాయుడు శ్రీకారం చుట్టనున్నారు. ఓటమికి గల కారణాలను విశ్లేషించుకొంటూ వచ్చే ఎన్నికలకు పార్టీని సన్నధ్దం చేస్తున్నారు. 

అమరావతి: పార్టీలో మార్పులు చేర్పులకు టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు శ్రీకారం చుట్టనున్నారు. అన్ని విభాగాల్లో యువతకు ఇక పెద్దపీట వేయనున్నారు. పార్టీలో సుమారు 40 నుండి 50 శాతం యువతకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు చంద్రబాబునాయుడు ప్రకటించారు.

ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని గుంటూరులో మంగళవారం నాడు నిర్వహించారు. భవిష్యత్తులో అవలంభించే విధానాలపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకొంటారు.

ఎన్నికల్లో ఓటమిపై సమీక్షించనున్నారు. వైఎస్‌ఆర్‌పీ అధికారంలోకి వచ్చిన తర్వాత చోటు చేసుకొన్న పరిణామాలపై కూడ చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలపై దాడులను ఎదుర్కోవాలని సమావేశం అభిప్రాయపడింది.

పార్టీలో కూడ మార్పులు చేర్పులు చేయాలని చంద్రబాబునాయుడు భావిస్తున్నారు. ఆయా కమిటీల్లో సీనియర్లను పక్కను తప్పించి యువతకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. కమిటీల్లో సామాజిక న్యాయానికి పెద్దపీట వేయనున్నారు.

మరో వైపు ఓకే స్థానం నుండి వరుసగా ఓటమి పాలౌతున్న అభ్యర్ధుల స్థానంలో కొత్తవారిని బరిలోకి దింపాలనే డిమాండ్ కూడ వస్తోంది.ఈ విషయాన్ని కూడ చంద్రబాబు పరిశీలిస్తున్నారనే  ప్రచారం పార్టీ వర్గాల్లో సాగుతోంది.

వైఎస్ఆర్‌సీపీ అవలంభిస్తున్న విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు క్షేత్రస్థాయి నుండి పనిచేయాలని చంద్రబాబు  పార్టీ నేతలకు సూచించారు. ఓటమి పాలయ్యామని టైం తీసుకోవద్దని ఆయన సూచించారు.

కొందరు నేతలు స్వచ్ఛంధగా ఈ సమావేశంలో  వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటామని ప్రకటించే  అవకాశం ఉంది. మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి తాను వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానని తన నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలకు చెప్పారు. రెండు మాసాల క్రితమే ఈ విషయాన్ని ఆయన తన పార్టీ క్యాడర్ కు వివరించారు.

ఇదే తరహాలో మరికొందరు నేతలు వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలనే అభిప్రాయంతో ఉండాలని పార్టీలో ద్వితీయ శ్రేణి నేతలు కోరుకొంటున్నారు. యువతకు ప్రాధాన్యత ఇచ్చేందుకు పోటీకి దూరంగా ఉండాలని వారు కోరుతున్నారు.

 

సంబంధిత వార్తలు

ప్రజలు తిరగబడితే వైసీపీ నిలువదు: చంద్రబాబు

రాజీనామా చేస్తా: గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన ప్రకటన

click me!