మడ అడవుల నరికివేత: జగన్ పై మండిపడ్డ చంద్రబాబు

By telugu teamFirst Published May 12, 2020, 11:35 AM IST
Highlights

ఇళ్ల స్థలాల కోసం కాకినాడ సమీపంలోని అడవులను నరికివేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దానిపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు.

అమరావతి: తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని మడ అడవుల నరికివేతకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు వచ్చినవార్తలపై ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. ఇళ్ల స్థలాల కోసం మడ అడవుల నరికివేతకు జగన్ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వ్చాచయి. 

కాకినాడ సమీపంలోని మడ అడవులను నరికివేయడం వల్ల వరద ప్రమాదాలు ఉంటాయని, భూమి కోతకు గురవుతుందని చంద్రబాబు అన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు 

మడ అడవుల నరికివేత వల్ల 54 వేల మందికి పైగా జాలర్లు ఉపాధి కోల్పోతారని అన్నారు. ఆ ప్రాంతంలోని వారి  కుటుంబాలు జీవనోపాధిని కోల్పోతాయని ఆయన అన్నారు. 

#SaveMadaForestFromJagan అనే హ్యాష్ ట్యాగ్ ఇచ్చి, జగన్ కు ట్యాగ్ చేస్తూ చంద్రబాబు ట్యాగ్ చేశారు. ఓ టీవీ చానెల్ వార్తాకథనాన్ని ట్వీట్ కు జత చేశారు.

 

.’s decision to wipe out the Mada Forest will not just bring large scale devastation to Kakinada in the form of storm surges & land erosion, but will also destroy the livelihoods of more than 54000 fishermen & their families living in the region pic.twitter.com/QTj8H0GeN3

— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn)
click me!